ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. వారం రోజుల నష్టానికి బ్రేకులు వేస్తూ మంగళవారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈ రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికి నష్టాల బాట పట్టాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 49.06 పాయింట్లు (0.13%) లాభపడి 38,672.76 వద్ద, నిఫ్టీ 14.50 పాయింట్లు (0.13%) లాభపడి 11,317.80 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఉదయం గం.10.34 సమయానికి సెన్సెక్స్ 63.85 (0.17%) పాయింట్లు నష్టపోయి 38,559.85 వద్ద, నిఫ్టీ 5.70 (0.050%) పాయింట్లు కోల్పోయి 11,297.60 వద్ద ట్రేడ్ అయింది.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

లాభాల్లో.. నష్టాల్లో మార్కెట్లు
హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, హిందూస్తాన్ యూనీలీవర్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, నెస్ట్లే, అల్ట్రా సిమెంట్, ఎల్ అండ్ టీ లాభాల్లో ట్రేడ్ కాగా, రిలయన్స్, ఐసీఐసీఐ, హీరో మోటో కార్ప్, కొటక్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా స్టీల్, పవర్ గ్రీడ్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్...
టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా, గెయిల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పేయింట్స్, టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి. ఈ రోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. ఆటో, బ్యాంకు, ఐటీ సెక్టార్లు లాభాల్లో ఉండగా, మెటల్ సెక్టార్ నష్టాల్లో ఉంది.

పదేళ్ల డేటా చూస్తే..
పదేళ్ల డేటా చూస్తే మార్చిలో మార్కెట్లు దాదాపు పరుగులు పెట్టాయి. కానీ కరోనా వైరస్ కారణంగా ఈసారి మార్కెట్లు నష్టాల్లోకి వెళ్తున్నాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 2018 నుండి ఇప్పటి వరకు వరస్ట్ మంత్లీ మార్కెట్ ఫిబ్రవరి కావడం గమనార్హం. అయితే మార్చి కాస్త బెట్టర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. పదేళ్ల డేటా ప్రకారం కూడా మార్చి బుల్లిష్‌గా ఉంటుంది.

లాభాల్లో ఈ సంవత్సరాలు..
మార్చి 2016లో సెన్సెక్స్ 10 శాతం లాభపడింది. 2011 మార్చిలో 9 శాతం, 2019 మార్చిలో 7 శాతం లాభపడ్డాయి. గత పదేళ్లలో మార్చి నెలలో మార్కెట్లుపై మూడు నెలలు టాప్‌లో నిలిచాయి. ఆయా సంవత్సరాల్లోని మార్చి నెలలను పరిశీలిస్తే... 2010లో 6.64 శాతం 2011లో 9.38 శాతం, 2014లో 6.81 శాతం, 2016లో 10.75 శాతం, 2.17లో 3.31 శాతం, 2019లో 7.70 శాతం లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ఈ సంవత్సరాలు..
2012 మార్చి, 2013 మార్చి, 2015 మార్చి, 2018 మార్చి నెలలు నష్టాల్లో ఉన్నప్పటికీ స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. నష్టపోయిన మార్చి నెలలను పరిశీలిస్తే 2012లో 1.66 శాతం, 2013లో అతి స్వల్పంగా 0.18 శాతం, 2015లో 4.62 శాతం, 2018లో 3.61 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications