Stock Market: వెనక్కి తగ్గమంటున్న సూచీలు.. నిన్న Sensex.. ఇవాళ Nifty..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఉత్కంఠకర పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మాత్రం మార్కెట్లు కరెక్షన్ కు గురవుతాయని వాదిస్తుంటే.. మార్కెట్లు మాత్రం పైపైకి పయనిస్తున్నాయి.
ఉదయం 9.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 10 పాయింట్ల మేర లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 106 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 9 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్లలో ఇన్వెస్టర్లు మార్కెట్ల గరిష్ఠాల కారణంగా తడపడుతున్నట్లు కనిపిస్తోంది.

నిన్న కొత్త రికార్డు స్థాయిని చేరుకున్న బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొంత అస్థిరతలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం రికార్డు స్థాయిలకు చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రధానంగా ఐటీ కంపెనీల షేర్ల నష్టాలు మార్కెట్లను కిందకు లాగుతున్నాయి.
ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయి.
ఇదే సమయంలో ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, ఎన్టీపీసీ, యూపీఎల్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications