5 నెలలు.. రూ.45 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తిరిగి వచ్చింది
గతవారం (మార్చి 24 నుండి మార్చి 28) మార్కెట్‌కు మంచి లాభాలు కలిగిన వారంగా చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ సంస్థల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ 50 కరోనా మహమ్మారి ముందు స్థాయికి చేరుకున్నాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ దెబ్బకు మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. మార్చి 23న పూర్తిగా పతనమయ్యాయి. లాక్ డౌన్ సమయంలోను కుప్పకూలాయి. అన్-లాక్ నుండి మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాయి. ఈ వారం కరోనా ముందు స్థాయికి చేరుకున్నాయి సూచీలు.

రూ.45 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి
గతవారం బీఎస్ఈ మార్చి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.58 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి నెలలో ఈ మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లకు పతనమైంది. ఆర్థిక కార్యకలాపాలు కోలుకున్న కొద్దీ ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద తిరిగి వస్తోంది. మార్చి నుండి ఇప్పటివరకు భారీగా కోలుకున్న మార్కెట్లకు ఈ 5 నెలల కాలంలో రూ.45 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ జత కలిసింది. అంటే ఈ మేరకు ఇన్వెస్టర్ల సంపద తిరిగి వచ్చింది.

వరుసగా రెండో వారం లాభాల్లో
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 9.97 శాతం లాభపడింది. గత వారంలోనే ఏకంగా 4.19 శాతం ఎగిసింది. శుక్రవారం సెన్సెక్స్ 39,467 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 11,647 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ వరుసగా రెండోవారం (2.43 శాతం) భారీగా లాభపడింది. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 2.6 శాతం, 3.7 శాతం మేర లాభపడ్డాయి.

రెండు కీలక తీర్పులు
ఈ వారంలో ఏజీర్, లోన్ మారటోరియంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు రానుంది. దీని ప్రభావం మార్కెట్ పైన ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏజీఆర్ తీర్పు టెలికం సంస్థలపై, లోన్ మారటోరియంపై తీర్పు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అది ఏ రకంగా అనేది తీర్పును బట్టి ఉంటుందని అంటున్నారు. లోన్ మారటోరియం తీర్పును సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications