అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో కీలక సమావేశం కానున్నారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లు, వాల్ స్ట్రీట్ సూచికలు సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఈ సంవత్సరం జరుగుతున్న ఐదవ రౌండ్ అమెరికా-చైనా వాణిజ్య చర్చల తర్వాతి దశగా చెప్పుకోవచ్చు. ఇటీవల మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో ఇరుపక్షాల వాణిజ్య ప్రతినిధులు తాత్కాలిక సమన్వయానికి వచ్చారని, తద్వారా తాజా ఉద్రిక్తతలకు విరామం లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక సంస్థ నోమురా తన విశ్లేషణలో, రెండు వారాల క్రితం ఊహించిన ఫలితాలకు ఇది దగ్గరగా ఉందని తెలిపింది. ఇరుపక్షాలు ఒకరి సరిహద్దులను పరీక్షించిన తర్వాత, చివరికి పరస్పర రాయితీలు ఇచ్చే అవకాశముందని పేర్కొంది. నోమురా ప్రకారం APEC శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం జరగడం, తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపుకు దారి తీసే అవకాశం ఉందని తెలిపింది.

అయితే ఈ సమావేశంలో పూర్తి వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆ సంస్థ హెచ్చరించింది. అధ్యక్షుడు Trump పూర్తి స్థాయి ఒప్పందాన్ని కోరుకున్నప్పటికీ, వాస్తవానికి రెండు దేశాలు తాత్కాలిక, పరిమిత అంశాలపై మాత్రమే అంగీకరించే అవకాశం ఉంది. అమెరికా ప్రకటించిన 100 శాతం సుంకం అమలు కావడం కష్టమే. గరిష్టంగా 90 రోజుల టారిఫ్ విరమణను పొడిగించవచ్చని నోమురా పేర్కొంది.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయకుమార్ మాట్లాడుతూ.. అమెరికా-చైనా మధ్య సుంకాలపై ఒప్పందం సాధ్యమని చెప్పారు. గురువారం జరిగే ట్రంప్-జిన్‌పింగ్ సమావేశంలో పురోగతి కనబడితే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మరింత ఉత్సాహంగా మారతాయి. ముఖ్యంగా S&P 500, నిక్కీ, కోస్పి వంటి సూచికలు రికార్డు స్థాయిలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదనంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు మార్కెట్లకు తాత్కాలిక సానుకూల సంకేతాలుగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.యుఎస్ CPI ద్రవ్యోల్బణం 3 శాతం వద్దనే ఉండటం, వడ్డీ రేట్లపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది కూడా ఈ వారంలో జరిగే FOMC సమావేశానికి మార్కెట్ సానుకూలంగా స్పందించేలా చేస్తుందని అన్నారు.
ఇక భారత మార్కెట్ల విషయానికి వస్తే మెహతా సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ.. ట్రంప్-జిన్‌పింగ్ సమావేశంపై పెట్టుబడిదారుల్లో ఆశావాదం పెరిగింది. ఈ సానుకూల ధోరణి కారణంగా నిఫ్టీ స్వల్ప పాజిటివ్ బైయస్‌తో ట్రేడయ్యే అవకాశం ఉందని తెలిపారు. క్లుప్తంగా చెప్పాలంటే అక్టోబర్ 30న జరగనున్న ట్రంప్-జిన్‌పింగ్ భేటీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మలుపు కానుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమావేశం తాత్కాలిక వాణిజ్య విరమణకు దారి తీసినా, పెట్టుబడిదారులకు ఇది తాత్కాలిక ఊరటగా మారవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications