Market Closing: దీపావళి సందర్భంగా కొనసాగిన గంట పాటు ప్రత్యేక ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్టర్లు మంచి లాభాలను నమోదు చేశారు. దీంతో ఈ ఏడాది కూడా లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ముగిశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలను ఆర్జించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 177 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 250 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని కోలాహలంగా ముగించాయి.

పెట్టుబడిదారుల ఉత్సాహంతో దలాల్ స్ట్రీట్ ప్రత్యేక దీపావళి ట్రేడింగ్ తక్కువ వాల్యూమ్ ట్రేడింగ్స్ ఉన్నప్పటికీ మంచి లాభాలను గడించాయి. ఈ గంట పాటు కొనసాగిన ట్రేడింగ్ వల్ల పెట్టుబడిదారుల సంపద బీఎస్ఈలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది.
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంవత్ 2080 బంపర్ ప్రారంభాన్ని నమోదు చేసింది. పైగా రానున్న ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లేదా మరొకరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ భారత ఆర్థిక వృద్ధి నిరాటంకంగా కొనసాగుతుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా అనిశ్చిత గ్లోబల్ ఆర్థిక అందకారంలో భారత్ వెలుగుచూపిస్తున్న దీపంలా మారటంతో విదేశీ మదుపరులు ఇండియాలో తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications