Reliance Retail IPO: అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నుంచి మరో ఐపీవో వస్తుందా అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆగస్టు 28న జరగనున్న ఏజీఎంలో దీనికి సంబంధించిన ప్రకటన ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు.
రిలయన్స్ రిటైల్‌లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 100 బిలియన్ డాలర్ల విలువతో 0.99 శాతం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.8,278 కోట్లకు ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ విలువ రూ.8.278 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. మూడేళ్లలో రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ దాదాపు రెట్టింపు అయింది. ఫైనాన్స్ వ్యాపారాన్ని జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా మార్కెట్లోకి ఫ్లోట్ చేసిన తర్వాతా మరో ఐపీవో వస్తుందని అందరూ భావిస్తున్నారు.

రిలయన్స్ రిటైల్‌లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వాటాను కొనుగోలు చేయడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 89.9 శాతం నుంచి 88.9 శాతానికి తగ్గింది. ఈ ఒప్పందం తర్వాత పెట్టుబడిదారులు రిలయన్స్ AGMపై దృష్టి సారించారు. దీనిలో రిలయన్స్ రిటైల్ IPOకి సంబంధించిన ప్రకటన ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అంతకుముందు జూలైలో రిలయన్స్ 0.4 శాతం ఈక్విటీ నాన్ ప్రమోటర్ షేర్లను ఒక్కో షేరు ధర రూ.1,362 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఈ ఒప్పందం తర్వాత విదేశీ బ్రోకరేజ్ హౌస్ CLSA రిలయన్స్ షేర్లకు రూ.3,060 టార్గెట్ ధరను ప్రకటించిస్తూ ఇన్వెస్టర్లకు BUY రేటింగ్ ఇచ్చింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనేది రిలయన్స్ రిటైల్ వ్యాపారం హోల్డింగ్ కంపెనీ. దీని డైరెక్టర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. ఈ రోజు మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర రూ.2,481.80 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications