మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: ఐటీ, ఫార్మా దెబ్బ
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో ఎత్తుపల్లాలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కలవరం ప్రభావం కనిపిస్తోంది. రెండో నెలలోకి అడుగు పెట్టినా సానుకూల వాతావరణం కనిపించడం లేదు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అందుకే ఈ వారం చివరి రోజు కూడా ఇన్వెస్టర్లు మార్కెట్ నుండి డబ్బులు వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపారు.
సెన్సెక్స్ ఉదయం 57,801.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,845.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,100.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,289.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,294.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,076.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 233.48 (0.41%) పాయింట్లు నష్టపోయి 57,362.20 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69.75 (0.40%) పాయింట్లు క్షీణించి 17,153.00 పాయింట్ల వద్ద ముగిసింది.

నేడు ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రియాల్టీ రంగం మాత్రం లాభాల్లో ముగిసింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, సిప్లా, ఐవోసీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications