stock market: ఇవాళే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదటి రిజల్ట్స్.. ఇన్వెస్టర్ల చూపంతా దీనిపైనే..
stock market: దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వేరొక ఎంటిటీగా ఇటీవల విడిపోయింది. రెండు నెలల అనంతరం ఇప్పుడు తన మొదటి ఫలితాలను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. IPOగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎంత బజ్ క్రియేట్ అయిందో.. సరిగ్గా ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి మార్కెట్ వర్గాల్లో కనిపిస్తోంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆగస్టులో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ అయింది. ఇవాళ తొలి ఫలితాలను ప్రకటించనుండగా.. ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) వృద్ధి అవకాశాలపై పలు ఫండ్ మేనేజర్లు 'బుల్లిష్'గా ఉన్నారు. అయితే ఆగస్టులో 6.63 శాతంగా ఉన్న తమ వాటాను మ్యూచువల్ ఫండ్స్ 2 శాతం మేర 4.71 శాతానికి తగ్గించడం గమనార్హం.

ఓ పక్క SBI మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా, HDFC మ్యూచువల్ ఫండ్ లు తమ వాటాను కుదించాయి. కానీ ఇన్వెస్కో, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ ఫండ్స్ మాత్రం తమ హోల్డింగ్‌లను పెంచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలువడనున్న ఫలితాలు.. కంపెనీ భవిష్యత్తును నిర్దేశిస్తాయని అంతా భావిస్తున్నారు.
సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్-డిపాజిట్ టేకింగ్ NBFCగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజిస్టర్ అయింది.
1999లో రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ప్రారంభించబడిన సంస్థ.. 2002లో 'ప్రైవేట్'ను తొలగించి కొత్త సర్టిఫికెట్ పొందింది. ఇటీవల జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గా మరోసారి పేరు మార్చుకుంది.


Click it and Unblock the Notifications