For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్: రూపాయి ఆల్ టైమ్ కనిష్టం

|

స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 9) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపాయి. దీంతో సూచీలు నష్టాలతో ఈ వారాన్ని ప్రారంభించాయి. అన్ని రంగాలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ అయితే ఏకంగా 2 శాతం క్షీణించింది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును పెంచింది. ఫెడ్ కూడా వడ్డీ రేట్లు పెంచుతోంది. అంతర్జాతీయంగా ఇతర కేంద్ర బ్యాంకులు ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

కారణాలివే

కారణాలివే

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా ప్రతికూలంగా ట్రేడ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణం పెరుగుతోంది. ఇది కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి కారణమవుతుంది. ఇది సూచీలను ఒత్తిడిలోకి నెట్టింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదిస్తుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ప్రతికూలంగా మారాయి.

సెన్సెక్స్ పతనం

సెన్సెక్స్ పతనం

సెన్సెక్స్ ఉదయం 54,188 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,365 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,918 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.45 సమయానికి 623 పాయింట్లు లేదా 1.15 శాతం క్షీణించి 54,205 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 181 పాయింట్లు లేదా 1.11 శాతం క్షీణించి 16,228 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ ఓ సమయంలో 950 పాయింట్ల వరకు క్షీణించింది.

సెన్సెక్స్ 30లో పవర్ గ్రిడ్ మాత్రమే లాభాల్లో ఉంది. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ ఉన్నాయి.

రూపాయి ఆల్ టైమ్ కనిష్టం

రూపాయి ఆల్ టైమ్ కనిష్టం

గతవారం మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.85 లక్షల కోట్లు క్షీణించింది. నేడు కూడా భారీగానే తగ్గింది. ఇదిలా ఉండగా డాలర్ మారకంతో రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.42 స్థాయికి చేరుకుంది. యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

English summary

మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్: రూపాయి ఆల్ టైమ్ కనిష్టం | Markets continue to slump amid weak global equities, Sensex dives over 713 points

Equity benchmarks continued to face heavy drubbing on Monday, with the Sensex tumbling over 713 points in early trade.
Story first published: Monday, May 9, 2022, 10:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X