Stock Market: లాభాల్లో ముగిసిన Sensex, Nifty.. నిండా ముంచిన బ్యాంకింగ్ రంగం..
Market Closing Bell: ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప ఒడిదొడుకులతో మిశ్రమంగా ముగింపు పలికాయి. ప్రధానంగా ఐటీ, ఫార్మా రంగాల షేర్లు లాభాల్లో ఉండగా.. బ్యాంకింగ్ స్టాక్స్ అత్యల్పంగా నష్టపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 42 పాయింట్ల స్వల్ప నష్టంలో ట్రేడింగ్ ముగించింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 194 పాయింట్లు లాభంలో ముగిసింది. నేడు ప్రధానంగా మార్కెట్లో నిఫ్టీ ఫార్మా మెరుగైన పనితీరును కనబరిచింది.

ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, ఎల్ టిఐఎమ్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో బ్రిటానియా, బజాజ్ ఆటో, ఎస్బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications