Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. రోజంతా సూచీల రికార్డుల మోత..
Market Closing: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో చారిత్రాత్మకమైన ఘటన చోటుచేసుకుంది. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ తన పాత రికార్డులను బద్ధలు కొట్టి సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ సూచీ 40 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 93 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 285 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ 63,588.31 మార్కును తాకటంతో రికార్డు నమోదైంది.ప్రధానంగా మెటల్ స్టాక్స్ నష్టపోగా.. పవర్ రంగంలోని కంపెనీలు మాత్రం లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, విప్రో, హీరో మోటార్స్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్, కోల్ ఇండియా, యూపీఎల్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications