Market Closing: ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు క్లోజింగ్ సమయానికి కొంత మేర కోలుకున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు నిరుత్సాహమైన పనితీరును కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ 93 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 435 పాయింట్లు పతనం కాగా.. మిడ్ క్యాప్ సూచీ భారీగా 561 పాయింట్లను కోల్పోయింది. ప్రధాన రంగాలు నేడు 1-3 శాతం మేర నష్టపోయాయి. FMCG, ఐటీ రంగాలు మినహా మిగిలిన సెక్టార్ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. నేటి పతనం కారణంగా బిఎస్‌ఇలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.23 లక్షల కోట్లు తగ్గి రూ.315.98 లక్షల కోట్లకు చేరుకుంది.

ప్రపంచ మార్కెట్ల పనితీరును గమనిస్తే.. బుధవారం ఆసియా మార్కెట్లు 11 నెలల కనిష్టానికి చేరాయి. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ 2.3 శాతం పడిపోయింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ 0.9 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పి కూడా 2.3 శాతం పతనమైంది. కాగా.. మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.3 శాతం పడిపోయింది. విస్తృత ఆధారిత S&P 500 ఇండెక్స్ 1.4 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 1.9 శాతం క్షీణించాయి. గడచిన పది సెషన్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర అమ్మకదారులుగా కొనసాగుతూ మంగళవారం రూ.2,034 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించారు.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, నెస్లే, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, ఎల్ టి, సన్ ఫార్మా, సిప్లా, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications