Market Closing: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మెరిసిన మిడ్ క్యాప్స్..
Closing Bell: ఉదయం స్వల్ప ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి. ప్రధానంగా మెటల్, ఫార్మా, పవర్ రంగాలకు చెందిన షేర్లు లాభపడటం కలిసొచ్చింది.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 286 పాయింట్లు లాభంతో ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 54 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 368 పాయింట్లు లాభపడింది. ప్రధానంగా కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించటంతో పాటు గ్లోబల్ మార్కెట్లలోని సానుకూల అంశాలు నేడు మార్కెట్లను ముందుకు నడిపించాయి.

ఎన్ఎస్ఈలో మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, ఐటీసీ, సిప్లా, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, రిలయన్స్, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications