గతవారం టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,22,591.01 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.96,642 కోట్లు క్షీణించింది. గతవారం మాత్రం అంతకు రెండున్నర రెట్లు ఎగిసింది. హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC, HDFC బ్యాంకు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ బెంచ్ మార్క్ గత వారం ఏకంగా 1690.88 పాయింట్లు లేదా 3.21 శాతం లాభపడింది. సెన్సెక్స్ ఆగస్ట్ 5వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం 54,717.24 పాయింట్లను తాకింది. ఆ తర్వాత చివరి సెషన్లో స్వల్పంగా తగ్గినప్పటికీ 54,277.72 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
- గతవారం కేవలం బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టాల్లో ముగియగా, మిగిలిన తొమ్మిది సంస్థలు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు లాభపడ్డాయి.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.52,766.97 కోట్లు పెరిగి, రూ.12,24,441.49 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.37,563.09 కోట్లు ఎగిసి రూ.8,26,332.67 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,173.81 కోట్లు ఎగిసి రూ.4,74,912.16 కోట్లకు చేరుకుంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.34,011.11 కోట్లు లాభపడి రూ.13,24,341.36 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది
- మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.17,078.94 కోట్లు పెరిగి రూ.7,02,898.22 కోట్లకు పెరిగింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,181.46 కోట్లు లాభపడి రూ.4,83,030.92 కోట్లకు పెరిగింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (HUL) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,705.23 కోట్లు లాభపడి రూ.5,57,111.01 కోట్లకు పెరిగింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,525.22 కోట్లు ఎగిసి రూ.3,88,800.70 కోట్లకు చేరుకుంది.
- ఒక్క బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ మాత్రం క్షీణించింది. ఈ మార్కెట్ క్యాప్ రూ.344.05 కోట్లు క్షీణించి రూ.3,75,628.83 కోట్లకు చేరుకుంది.

టాప్ టెన్ కంపెనీలు
మార్కెట్ క్యాపిటలైజేష్ పరంగా టాప్ టెన్ చూస్తే... వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL), ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.
గతవారం మొదటి నాలుగు సెషన్లలో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. చివరి సెషన్ మాత్రం నష్టపోయింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ అనంతరం సూచీలు నష్టపోయాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కంటే రిలయన్స్ ఇండస్ట్రీస్-అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ కేసు తీర్పు భారీ ప్రభావం చూపింది. చివరి సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్థికరంగాల షేర్లపై ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. దీంతో అంతకుముందు 4 రోజుల లాభాల జోరుకు కళ్లెంపడింది. దీంతో ఆల్ టైమ్ గరిష్ఠాల నుండి సూచీలు వెనక్కి వచ్చాయి. రిలయన్స్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు రావడంతో రిలయన్స్ షేర్లు కుప్పకూలాయి. దీనికితోడు కరోనా డెల్టా కేసులు పెరుగుతుండటంతో ఆసియా-పసిఫిక్ సూచీలు అప్రమత్తంగా కదలాడాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications