ముంబై: టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,37,396.66 కోట్లు ఎగిసింది. ఎక్కువగా లాభపడిన కంపెనీల్లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందు నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్లు దాటి, 12 లక్షల కోట్లకు చేరువైంది. గత కొద్ది నెలలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.2000కు దిగువనే ఉంది. అదే సమయంలో టీసీఎస్ జంప్ చేస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే రిలయన్స్‌కు అతి సమీపంలో ఉన్న టీసీఎస్.. మార్కెట్ క్యాప్ పరంగా దాటవేసినా ఆశ్చర్యం లేదు.

మార్కెట్ క్యాప్
గతవారం లాభపడిన కంపెనీల్లో టీసీఎస్‌తో పాటు HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL), ఇన్ఫోసిస్, HDFC, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.72,102.07 కోట్లు పెరిగి రూ.11,70,875.36 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.21,894.28 కోట్లు పెరిగి రూ.5,58,772.73 కోట్లకు ఎగిసింది.
HDFC మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.15,076.62 కోట్లు పెరిగి రూ.4,77,663.03 కోట్లకు చేరింది.
భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.13,720.73 కోట్లు లాభపడి రూ.2,94,736.49 కోట్లుగా నమోదయింది.
ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.10,054.48 కోట్లు ఎగిసి రూ.3,74,253.88 కోట్లుగా ఉంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,855.36 కోట్లు జంప్ చేసి రూ.7,88,613.86 కోట్లుగా నమోదయింది.
HUL మార్కెట్ క్యాప్ రూ.693.12 కోట్లు ఎగిసి రూ.5,61,626.18 కోట్లకు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.34,296.37 కోట్లు క్షీణించి రూ.12,25,445.59 కోట్లుగా నమోదయింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.12,024.63 కోట్లు తగ్గి రూ.3,06,156.55 కోట్లకు పడిపోయింది.
కొటక్ మహీంద్ర బ్యాంకు ఎం-క్యాప్ రూ.4,661.65 కోట్లు తగ్గి రూ.3,90,253.33 కోట్లుగా ఉంది.
ఇక, గత వారం సెన్సెక్స్ 913.53 పాయింట్లు లేదా 1.90 శాతం లాభపడింది.
టాప్ 10 కంపెనీల పరంగా వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications