ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన, నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 30.19 పాయింట్లు లేదా 0.08% పెరిగి 38,523.14 వద్ద, నిఫ్టీ 5.00 పాయింట్లు లేదా 0.04% ఎగిసి 11,305.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 624 షేర్లు లాభాల్లో, 312 షేర్లు నష్టాల్లో ఉండగా, 54 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆ తర్వాత కాసేపటికి మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.1.15 సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 38,305 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 11,300 కంటే కిందకు పడిపోయింది. డాలర్ మారకంతో ఇండియన్ రూపాయి 74.83 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. మంగళవారం 74.83 ఇదే ధర వద్ద క్లోజ్ అయింది.

ఒత్తిడిలో ఐటీ షేర్లు
మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, గ్రాసీమ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, భారతీ ఇన్ఫ్రాటెల్ ఉన్నాయి టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లె, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. రెండు రోజుల పాటు దూసుకెళ్లిన ఐటీ షేర్లు ఈ రోజు నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ షేర్లు ఒత్తిడిలో కూరుకుపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు క్వార్టర్ 1 ఫలితాల్లో 68 శాతం లాభాలు క్షీణించినప్పటికీ, నికర ఎన్పీఏలు 1.23 శాతం నుండి 0.86 శాతానికి తగ్గాయి. దీంతో ఈ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లింది. నికర అమ్మకాలు 26 శాతం పెరిగాయి. దీంతో టాటా కాఫీ షేర్లు ఎగిశాయి.

కంపెనీల ఫలితాలు
ఈ రోజు 180 కంపెనీలు తమ క్వార్టర్ ఫలితాలను విడుదల చేయనున్నాయి. బారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలు, అన్ని కంపెనీలపై ప్రభావం పడింది. ఇప్పటికే వివిధ సంస్థల ఆదాయం తగ్గింది. పలు కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మరిన్ని కారణాలు..
కరోనా కేసులు పెరగడంపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌లు కరోనాను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి.అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకుల ఉద్దీపన ప్యాకేజీలు, కరోనా కేసులు పెరగడం వంటివి గ్లోబల్ మార్కెట్లలో నష్టాలకు కారణమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.
కేంద్ర బ్యాంకు ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈఎంఐ తిరిగి ప్రారంభం కానుంది. లోన్ మారటోరియం పొడిగింపు ఉంటుందా, పొడిగింపు ఉన్నప్పటికీ.. లేకపోయినప్పటికీ బ్యాంకులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అలాగే సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈఎంఐ మారటోరియంను పొడిగించాలని కూడా కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications