For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు: లాభాల్లో బ్యాంకింగ్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం గం.9.16 నిమిషాలకు సెన్సెక్స్ 185.97 (0.45%) పాయింట్లు, నిఫ్టీ 49.40 (0.41%) పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 505 షేర్లు లాభాల్లో, 136 షేర్లు నష్టాల్లో, 23 షేర్లలో ఎలాంటి మార్పులు లేవు. అయితే సాయంత్రానికి నష్టాల్లోకి వెళ్లింది. సాయంత్రం గం.2.50 సమయానికి సెన్సెక్స్ 159.10 (0.39%) పాయింట్ల నష్టంతో 41,164.71 వద్ద, నిఫ్టీ 47.45 (0.39%) పాయింట్ల నష్టంతో 12,122.40 వద్ద ట్రేడ్ అయింది.

డాలరుతో రూపాయి మారకం విలువ 71.21 వద్ద ట్రేడ్ అయింది. ఓఎన్జీసీ, కోల్ ఇండియా రంగాలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్, ఫార్మా రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, గ్రాసీమ్, నెస్ట్లే, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా మోటార్స్ ఉన్నాయి.

హైదరాబాద్ యువత అప్పు ఎక్కువే చేస్తోంది, ఎందుకో తెలుసా?హైదరాబాద్ యువత అప్పు ఎక్కువే చేస్తోంది, ఎందుకో తెలుసా?

Market Updates: Sensex drops 200 pts, Nifty near 12,100

ఇధిలా ఉండగా, బడ్జెట్ డెఫిసిట్ పెరుగుతుందనే ఆందోళనతో విదేశీయులు బాండ్స్‌ను విక్రయిస్తున్నారు. జనవరి నెలలో ఇప్పటి వరకు 110.2 బిలియన్ రూపాయల ప్రభుత్వ బాండ్లను ఫారన్ ఇన్వెస్టర్లు విక్రయించారు. 2020-21 బడ్జెట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ రికార్డు రుణ ప్రణాళికలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

English summary

లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు: లాభాల్లో బ్యాంకింగ్ | Market Updates: Sensex drops 200 pts, Nifty near 12,100

The S&P BSE Sensex slipped 206 points, or 0.5 per cent, to 41,120 levels. ONGC and NTPC (both down 4%) were the top laggards in the Sensex pack. On the other hand, Nestle India, HCL Tech, and TCS (up 1%) gained the most.
Story first published: Wednesday, January 22, 2020, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X