భారీ లాభాల్లో దలాల్ స్ట్రీట్, నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ముంబై: భారత మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టం, నిఫ్టీ 00.8 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైనా గం.9.45 నిమిషాలకు సెన్సెక్స్ 219 పాయింట్లు, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం గం.1.18 సమయానికి సెన్సెక్స్ 283.82 (0.69%) పాయింట్లు ఎగిసి 41,399.20 వద్ద, నిఫ్టీ 73.65 (0.61%)
పాయింట్లు పెరిగి 12,180.55 వద్ద ట్రేడ్ అయింది.
ఎఫ్ఎంసీజీ సెక్టార్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలోని షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. చైనాలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

మధ్యాహ్నం గం.1 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, ఐవోసీ, లార్సన్, బీపీసీఎల్, టాటా మోటార్స్ ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యూపీఎల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్ప్, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications