ముంబై: భారత మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. మంగళవారం స్వల్ప లాభాలతో క్లోజ్ అయిన మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 4, మార్చి) లాభాలతో ప్రారంభమై నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 11,110 పాయింట్లకు దిగజారింది. రూపాయి 16 నెలల కనిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్ ఓ దశలో 38,000 మార్క్ దిగువకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకుంది.
కరోనా వైరస్ కేసులు జాతీయంగా, అంతర్జాతీయంగా రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. ఔషధ కంపెనీలు సిప్లా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ ఉన్నాయి.

ఫార్మా రంగం మినహా మిగతా అన్ని రంగాలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. భారీగా నష్టపోయిన స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఉన్నాయి. కరోనా వైరస్ మార్కెట్లను భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications