For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

12,000కు చేరువలో నిఫ్టీ, రికార్డ్ స్థాయికి సెన్సెక్స్ @40,300, కారణాలివే!

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 31) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగా, సెన్కెస్స్ 168.95 పాయింట్లు లేదా 0.42% శాతం లాభంతో 40220.82 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 47.40 పాయింట్లు లేదా 0.40% లాభంతో 11891.50 వద్ద ప్రారంభమైంది. 555 షేర్లు లాభాల్లో ఉండగా, 145 షేర్లు నష్టాల్లో, 24 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఉదయం ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, హీరో మోటో కారర్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఐటీసీ, హిదూస్తాన్ యూనీ లివర్, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కొటక్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఏసియన్ పేయింట్స్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

టెలికో కష్టాలపై కేంద్రం కమిటీ, కస్టమర్లకు షాక్: ఉచిత కాల్స్టెలికో కష్టాలపై కేంద్రం కమిటీ, కస్టమర్లకు షాక్: ఉచిత కాల్స్

 Market update: Sensex hits record high with above 40K, Nifty above 11,900

ఈ ఏడాది మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెన్సెక్స్ 40వేల మార్క్ దాటింది. అప్పటి నుంచి అదానీ, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, రిలయన్స్ నిప్పోన్, బెర్గర్ పెయింట్స్, అపోట్టా, డాక్టర్ లాల్ పత్ లాబ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, వర్ల్ పూల్, జీఎంఆర్, కోల్గేట్, అదానీ పవర్, జైడస్, ట్రెంట్ వంటి షేర్లు మంచి లాభాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.22 సమయానికి 244.07 (0.61%) పాయింట్ల ఎగిసి (నిన్నటితో పోలిస్తే) 40,295.94 వద్ద, నిఫ్టీ 72.55 (0.61%) పెరిగి 11,916.65 వద్ద ఉంది. రూపాయితో డాలర్ మారకం విలువ 70.54 వద్ద ట్రేడ్ అయింది. కేంద్ర ప్రభుత్వ వివిధ రకాల పన్నులు తగ్గించవచ్చుననే అంచనాలతో సెన్సెక్స్ దూసుకెళ్తోంది. పబ్లిక్ సెక్యార్ బ్యాంకులు, ఐటీ, మెటల్, ఎనర్జీ , ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(LTCG), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ల్లో మార్పులు చేయనున్నారనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల రెండో క్వార్టర్ ఫలితాలు అంచనాలను మించుతున్నాయి. ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు కూడా సానుకూల ప్రభావం చూపాయి.

దీనికి తోడు భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్ విషయమై సుప్రీం కోర్టు తీర్పు గుదిబండగా మారింది. దీంతో ఈ రంగాన్ని బెయిలవుట్ చేసేందుకు మోడీ ప్రభుత్వం కార్యదర్శుల సంఘాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి.

English summary

12,000కు చేరువలో నిఫ్టీ, రికార్డ్ స్థాయికి సెన్సెక్స్ @40,300, కారణాలివే! | Market update: Sensex hits record high with above 40K, Nifty above 11,900

All the sectoral indices are trading in the green led by PSU bank, IT, metal, energy and FMCG.
Story first published: Thursday, October 31, 2019, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X