ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 167.12 పాయింట్లు (0.40%) ఎగిసి 41,626.91 వద్ద, నిఫ్టీ 49.20 పాయింట్లు (0.40%) పెరిగి 12,223.90 వద్ద ప్రారంభమైంది. 534 షేర్లు లాభాల్లో, 185 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 33 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. గం.10.33 సమయానికి సెన్సెక్స్ 110.38 (0.27%) పాయింట్లు పెరిగి 41,570.17 వద్ద, నిఫ్టీ 33.75 (0.28%) పాయింట్లు పెరిగి 12,208.40 వద్ద ట్రేడ్ అయింది. రూపాయితో డాలర్ మారకం విలువ 71.22 వద్ద ఉంది. బ్యాంకింగ్, ఐటీ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు పుంజుకున్నాయి.
నెస్ట్లే, ఏషియన్ పేయింట్స్, టైటాన్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, కొటక్ బ్యాంకు, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్తాన్ యూనీ లీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, బీపీసీఎల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, బజాజ్ ఆటో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.
పెరుగుతున్న బంగారం ధర
బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు మరోసార కమ్ముకున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెడుతున్నారు. దీంతో బంగారం ధర పెరుగుదోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.240కి పెరిగి రూ. 38,880, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 240 పెరిగి రూ.42,390కు చేరుకుంది. వెండి ధర కూడా రూ.200 పెరిగింది. గురువారం ముంబైలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.183 పెరిగి రూ.40,766గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.37,342గా ఉంది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications