అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత మార్కెట్లు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల సమయంలో సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టం, నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. రూపాయి 19 పైసలు పడిపోయి 72.02 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 71.83 వద్ద క్లోజ్ అయింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 226.47 (0.55%) పాయింట్లు నష్టపోయి 40,643.00 వద్ద, నిఫ్టీ 77.35 (0.64%) పాయింట్లు కోల్పోయి 11,975.60 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 300 పాయింట్లు కూడా నష్టపోయింది. మెటల్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, టెలికం ఇలా అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
అల్ట్రా సిమెంట్ కంపెనీ, టీసీఎస్, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనీలీవర్, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎన్టీపీసీ, ఐటీసీ, నెస్ట్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా, టైటాన్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

కాగా, సోమవారం భారీగా నష్టపోయిన మార్కెట్లు మంగళవారం కాస్త కుదురుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతపై మార్కెట్ వర్గాల్లో ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న సూచీలు కొద్దిగా కోలుకున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 553 పాయింట్లు బలపడి మళ్లీ 41వేల ఎగువకు చేరుకుంది. చివరికి 192.84 పాయింట్ల లాభంతో 40,869.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59.90 పాయింట్లు పెరిగి 12,052.95 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications