ఊగిసలాటలో మార్కెట్లు, 12,350 వద్ద సెన్సెక్స్, లాభాల్లో ఎయిర్‌టెల్, నష్టాల్లో వొడాఫోన్ ఐడియా
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 17) మందకోడిగా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 23.37 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 14.30 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఇన్ఫ్రాటెల్, వొడాఫోన్ ఐడియా, ఎస్బీఐ, యస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
కార్పోరేట్ సంస్థల ఆదాయాల అంచనాలపై సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. అదే సమయంలో AGR ఛార్జీల చెల్లింపుపై టెల్కోలు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం కూడా ప్రభావితం చేసింది. మధ్యాహ్నం గం.11.34 సమయానికి సెన్సెక్స్ 32.10 (0.077%) పాయింట్ల లాభంతో 41,964.66 వద్ద, నిఫ్టీ 1.90 (0.015%) పాయింట్ల నష్టంతో 12,353.60 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, గెయిల్, కోల్ ఇండియా ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు 22 శాతానికి పైగా కుంగింది. అదే సమయంలో ఎయిర్‌టెల్ షేర్లు (4 శాతం) లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications