రోజంతా లాభాల్లో.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్: సరికొత్త గరిష్టాలకు సూచీలు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూన్ 15) భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా అలాగే కొనసాగి, చివరకు 200కు పైగా పాయింట్ల లాభాల్లో ముగిసింది. వరుసగా నాలుగు రోజుల పాటు సూచీలు లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైం గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో పాటు దిగ్గజ కంపెనీల స్టాక్స్ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం కలిసి వచ్చింది.
దీంతో సెన్సెక్స్ 52,700 పాయింట్లకు పైన, నిఫ్టీ 15,900 పాయింట్లకు సమీపంలో ముగిసింది.
అదానీ గ్రూప్ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఈ గ్రూప్ షేర్లలో రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను NSDL స్తంభింప చేసినట్లు వచ్చిన వార్తలతో సోమవారం అదానీ గ్రూప్ షేర్ల వ్యాల్యూ భారీగా పతనమైన విషయం తెలిసిందే.

భారీ లాభాల్లో స్టాక్స్
సెన్సెక్స్ 52,751.83 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,869.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,671.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,866.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,901.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,842.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 221.52 (0.42%) పాయింట్లు ఎగిసి 52,773.05 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 57.40 (0.36%) పాయింట్లు లాభపడి 15,869.25 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 3.13 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.99 శాతం, ICICI బ్యాంకు 1.60 శాతం, HDFC లైఫ్ 1.59 శాతం, HUL 1.16 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 1.71 శాతం, కోల్ ఇండియా 1.38 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.07 శాతం, హిండాల్కో 1.00 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.92 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.36 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.01 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.57 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.73 శాతం, నిఫ్టీ ఐటీ 0.23 శాతం, నిఫ్టీ మీడియా 2.00 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.32 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.01 శాతం, నిఫ్టీ మెటల్ 0.05 శాతం, నిఫ్టీ ఫార్మా 0.88 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.26 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications