For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: HDFC దూకుడు, అవెన్యూ డౌన్, ఐటీ స్టాక్స్ డౌన్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 19) లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా పది రోజుల పాటు లాభాలు చూసిన మార్కెట్లు, గత గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం తిరిగి లాభాలు చూసిన మార్కెట్లు, నేడు ప్రారంభంలోనే ఎగిశాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 319.59 పాయింట్లు (0.80%) ఎగిసి 40,302.57 పాయింట్ల వద్ద, నిఫ్టీ 86.40 పాయింట్లు (0.73%) ఎగిసి 11,848.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 739 షేర్లు లాభాల్లో, 212 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 67 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్

హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఆ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. HDFC బ్యాంకు షేర్ రెండు శాతం మేర లాభపడింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ 58 శాతం మేర క్షీణించాయి. దీంతో వాహన రంగ షేర్లపై ప్రభావం పడింది.

బ్యాంకింగ్ రంగ షేర్లు ఈ రోజు బాగా రాణిస్తున్నాయి. టాప్ 5 గెయినర్స్‌లో నాలుగు బ్యాంకింగ్ రంగ షేర్లు ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, యూపీఎల్, హీరో మోటో కార్ప్, దివిస్ ల్యాబ్స్, టీసీఎస్ ఉన్నాయి.

యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

నిఫ్టీ బ్యాంకు అదుర్స్

నిఫ్టీ బ్యాంకు అదుర్స్

నిఫ్టీ బ్యాంకు 2.50 శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఎనర్జీ 1 శాతం లాభాల్లో ఉంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి.

అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ సేల్స్ పెరిగాయి.

రియల్ ఎస్టేట్‌కు చెందిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ స్టాక్స్ 3 శాతం పెరిగాయి.

ఒబెరాయ్ రియాల్టీ కూడా 2 శాతం లాభపడింది.

జెట్ ఎయిర్వేస్ బిడ్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్స్ 5 శాతం మేర లాభపడ్డాయి.

బ్రిటానియా ఫలితాల రానున్న నేపథ్యంలో ఈ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

ఫార్మా స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతోంది.

అవెన్యూ సూపర్ మార్ట్స్ డౌన్

అవెన్యూ సూపర్ మార్ట్స్ డౌన్

మార్కెట్లు ప్రారంభమైన మొదటి గంటలో కజారియాసెర్, ఓఎన్జీసీ, ఫెడరల్ బ్యాంకు, డీహెచ్ఎఫ్ఎల్, సుజ్లాన్ స్టాక్స్ భారీ లాభాలు నమోదు చేశాయి.

అవెన్యూ సూపర్ మార్ట్స్ 2 శాతం క్షీణించింది. ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ త్రైమాసికంలో సేల్స్ 38 శాతం క్షీణించాయి. ఈ ప్రభావం అవెన్యూ సూపర్ మార్ట్స్ పైన పడింది.

వొడాఫోన్ ఐడియా షేర్ 2 శాతం మేర క్షీణించింది. అలోక్ ఇండస్ట్రీస్ 0.43 శాతం పడిపోయింది. సౌత్ ఇండియా బ్యాంకు 3.90 శాతం నష్టపోయింది.

డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం లాభపడింది.

దిగ్గజ ఐటీ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

డాలర్ మారకంతో రూపాయి 74.38 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్ (శుక్రవారం)లో 74.34 వద్ద క్లోజ్ అయింది.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: HDFC దూకుడు, అవెన్యూ డౌన్, ఐటీ స్టాక్స్ డౌన్ | Market today: Sensex gains 300 points, Nifty around 11,850

Indian indices opened higher on Monday, tracking gains in Asian peers, led by gains in financials after HDFC Bank reported better than expected numbers in the September quarter.
Story first published: Monday, October 19, 2020, 10:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X