ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 31) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 106.53 పాయింట్లు(0.22 శాతం) లాభపడి 47639.69 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31.70 పాయింట్లు(0.23 శాతం) ఎగిసి 13950.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. మొత్తానికి మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. నిన్న సెన్సెక్స్ 47,746 వద్ద క్లోజ్ అయింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 16 పైసలు బలపడి 73.15 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్లో 73.31 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC 1.57 శాతం, ICICI బ్యాంకు 1.10 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.70 శాతం, టాటా మోటార్స్ 0.54 శాతం, అదానీ పోర్ట్స్ 0.43 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 1.82 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.24 శాతం, UPL 1.03 శాతం, గెయిల్ 1.02 శాతం, గ్రాసీమ్ 0.98 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్ ఉన్నాయి.

14000 పాయింట్లను తాకిన నిఫ్టీ
నిఫ్టీ నేడు సరికొత్త గరిష్టాలను తాకింది. ఓ సమయంలో 14,008 పాయింట్లు క్రాస్ చేసింది. అనంతరం ఉదయం గం.11 సమయానికి స్వల్పంగా 0.19 శాతం లాభపడి 13,984 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న 13,982 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇండియన్ బ్యాంక్ స్టాక్ 0.6 శాతం లాభపడింది. పర్పెట్యువల్ బాండ్స్ ద్వారా రూ.39 కోట్లు రెయిజ్ చేయనున్న నేపథ్యంలో స్టాక్ పెరిగింది.
RITES దాదాపు ఒక శాతం లాభపడింది.
రిలయన్స్ స్టాక్ నేడు రూ.2000ను తాకింది. నేడు 0.28 శాతం పెరిగి రూ.2,001 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.03శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.06 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 0.02 శాతం, నిఫ్టీ ఫార్మా 0.54 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.60 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.05 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.02 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ ఐటీ 0.32 శాతం, నిఫ్టీ మెటల్ 0.53 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.18 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.09 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications