ముంబై: వరుసగా రికార్డులు సృష్టిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (గురువారం, డిసెంబర్ 10) ఢీలాపడ్డాయి. నిన్న తొలిసారి సెన్సెక్స్ 46వేల మార్కును దాటింది. నిఫ్టీ 13,500 క్రాస్ చేసింది. దీంతో నేడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, ఇన్ఫ్రా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాల్లో కనిపించిన సెన్సెక్స్, ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ, నష్టాల్లోనే ముగిసింది. 360 పాయంట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత నష్టం మాత్రం తగ్గింది.

లాభాలకు బ్రేక్
వరుస 7 రోజుల లాభాలకు నేడు బ్రేక్ పడింది. నిఫ్టీ 13,500 పాయింట్ల కిందకు దిగి వచ్చింది. సెన్సెక్స్ 143.62 పాయింట్లు(0.31%) నష్టపోయి 45,959.88 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50.80 పాయింట్లు (0.38%) నష్టపోయి 13478.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1209 షేర్లు లాభాల్లో, 1642 షేర్లు నష్టాల్లో ముగియగా, 158 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి.
డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు క్షీణించి 73.71 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 73.69 వద్ద ప్రారంభమైంది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో UPL, రిలయన్స్, ఐటీసీ, HDFC బ్యాంకు, టాటా స్టీల్ ఉన్నాయి.
నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో నెస్ట్లే 4.46 శాతం, ఐటీసీ 3.55 శాతం, బ్రిటానియా 3.11 శాతం, హెచ్‌యూఎల్ 2.54 శాతం, అదానీ పోర్ట్స్ 1.53 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో UPL 10.99 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 3.51 శాతం, టాటా మోటార్స్ 2.79 శాతం, శ్రీసిమెంట్స్ 2.71 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.50 శాతం నష్టపోయాయి.
రిలయన్స్ స్టాక్ ధర 0.93 శాతం లాభపడి రూ.2,008 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా చూస్తే..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 0.38 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.03 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.99 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.65 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.91 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.72 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 1.62 శాతం, నిఫ్టీ ఫార్మా 0.03 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.54 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.64 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.81 శాతం, నిఫ్టీ మెటల్ 0.23 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.25 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications