ప్యాకేజీ ప్రభావంలేదు.. నిన్నటిదాకా నష్టాలు, నేడు భారీ లాభాల్లోకి మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 19) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 315.34 పాయింట్లు లేదా 1.05% ఎగిసి 30,344.32 వద్ద, నిఫ్టీ 92.10 పాయింట్లు లేదా 1.04% పెరిగి 8,915.35 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 534 షేర్లు లాభాల్లో 136 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ 500 పాయింట్లు కూడా దాటింది. నిన్నటి వరకు ప్యాకేజీ ప్రభావం ఏమీ కనిపించలేదు. కానీ ఈ రోజు మళ్లీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదాని పోర్ట్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, వేదాంత, హిందూస్తాన్ యూనీ లీవర్ ఉన్నాయి. బ్యాంకు, ఆటో, మెటల్ రంగాల నుండి మద్దతు కారణంగా స్టాక్స్ ఈ రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోడీ గత మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. దీంతో మరుసటి రోజు మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. అయితే ఆ రోజు సాయంత్రం నుండి నిర్మలా సీతారామన్ ఉద్దీపనలకు సంబంధించిన వివరాలను ఐదు రోజుల పాటు వరుసగా ప్రకటించింది. కానీ నిర్మల ప్యాకేజీ మార్కెట్‌కు రుచించలేదు. దీంతో గురువారం నుండి మార్కెట్లు నష్టపోతున్నాయి. ఆదివారం చివరి ప్యాకేజీ ప్రకటించారు. దీంతో నిన్న.. సోమవారం వరకు నష్టాలే చూశాయి. ఈ రోజు కాస్త కోలుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications