ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు రానున్నారని వార్తలు వెలువడటంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. వ్యవస్థలోకి ద్రవ్యం, మార్కెట్‌కు ఊతమిచ్చే ఇతర ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. దీంతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్లు, నేడు శుభారంబాన్ని ఇచ్చాయి.
ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 1,063.78 పాయింట్లు లేదా 3.48% పెరిగి 31,666.39 వద్ద, నిఫ్టీ 309.50 పాయింట్లు లేదా 3.44% ఎగిసి 9,302.30 వద్ద ప్రారంభమైంది. 797 షేర్లు లాభాల్లో, 64 షేర్లునష్టాల్లో ప్రారంభం కాగా, 23 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ 30 షేర్లు అన్ని కూడా లాభాల్లోనే ఉన్నాయి. అన్ని రంగాల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి.

ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు టీసీఎస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హీరో మోటో, మారుతీ, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, హిందూస్తాన్ యూనీ లీవర్, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పేయింట్స్, నెస్ట్లే.. ఇలా అన్ని షేర్లు కూడా 7 శాతం నుండి 1 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications