నష్టాల్లో ముగిసిన మార్కెట్, రూపాయి బలహీనం: నిన్న అందుకే సెన్సెక్స్ రికార్డ్స్
ముంబై: షేర్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 8) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా కేసులు, మృతుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అంతకుముందు సంకేతాలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. కానీ కేసులు, మృతుల సంఖ్య తిరిగి పెరగడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లు, భారత మార్కెట్లపై పడింది.
నేడు ఉదయం సెన్సెక్స్ 271.60 పాయింట్లు (0.90%) నష్టపోయి 29,795.61 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 78.85 పాయింట్లు (0.90%) పడిపోయి 8,713.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చినప్పటికీ ఊగిసలాటలో ఉంది. 450 షేర్లు లాభాల్లో, 335 షేర్లు నష్టాల్లో ఉండగా, 39 షేర్లలో మార్పు లేదు. HCL టెక్, సిప్లా, గెయిల్, HDFC, HUL లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ సిమెంట్స్, జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంకు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈ రోజంతా మార్కెట్లు ఊగిసలాటలోనే ఉన్నాయి. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 29,894 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 8,748 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.34 వద్ద ముగిసింది.

నిన్న అందుకే ఎగిసిన మార్కెట్లు..
నిన్న (ఏప్రిల్ 7) మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ఆసియా, యూరోప్ మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా స్టాక్స్ దాదాపు 7 శాతం, ఆసియా మార్కెట్లు 2-4 శాతం, యూరోప్ మార్కెట్లు 2 శాతంతో క్లోజ్ అయ్యాయి. దీంతో భారత మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిప్టీలు ఒకరోజు రికార్డ్ ఎదుగుదలను సాధించాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం మరో ప్యాకేజీ సిద్ధం చేస్తుందనే వాదనలు వినిపించాయి. ఇది కూడా మార్కెట్లకు జోష్ తెప్పించింది. FMCG, ఫార్మా షేర్లు దూకుడు ప్రదర్శించాయి. నిన్న రూపాయి కూడా 49 పైసలు బలపడి 75.46 వద్ద క్లోజ్ అయింది.

దూకిన రిలయన్స్ మార్కెట్ క్యాప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ నిన్న భారీగా ఎగిసింది. బీఎస్ఈలో షేర్ 11.89 శాతం పెరిగి రూ.1,206.40 వద్ద క్లోజ్ అయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.81,269.41 కోట్లు పెరిగి రూ.7,64,769.23కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.8 లక్షల కోట్లు పెరిగింది.

సెన్సెక్స్ టాప్ 10 గెయిన్స్
సెన్సెక్స్ నిన్న రికార్డ్ సింగిల్ డే గరిష్టాన్ని నమోదు చేసింది. అంకెల పరంగా అయితే సెన్సెక్స్ హిస్టరీలో మొదటిసారి. సెన్సెక్స్ టాప్ 10 గెయిన్స్ ఇలా ఉన్నాయి...
2,476.26 - 2020 ఏప్రిల్ 07
2,110.79 - 2009 మే 18
1,921.15 - 2019 సెప్టెంబరు 20
1,861.75 - 2020 మార్చి 25
1,627.73 - 2020 మార్చి 20
1,421.90 - 2019 మే 20
1,325.34 - 2020 మార్చి 13
1,139.92 - 2008 జనవరి 25
1,075.41 - 2019 సెప్టెంబరు 23
928.09 - 2008 మార్చి 25


Click it and Unblock the Notifications