ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనావైరస్ కష్టాలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ రోజు (9 మార్చి, 2020) భారత మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 15 శాతం పడిపోయాయి. ఉదయం గం.9.44 సమయానికి సెన్సెక్స్ 1,352.77 (3.60%) పడిపోయి 36,223.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 388.00 (3.53%) పాయింట్లు తగ్గి 10,601.45 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మార్కెట్లు ఏ దశలోను కోలుకోలేదు. గంట గంటకూ పడిపోయాయి. ఓ దశలో సెన్సెక్స్ 2,400 పాయింట్లు నష్టపోయి 15 నెలల కనిష్టానికి చేరుకుంది. ఏకంగా 2వేలకు పైగా పాయింట్లు కోల్పోవడం గమనార్హం.

భారీ నష్టాల్లో మార్కెట్లు
ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 1,165.38 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ 10,700 దిగువన ప్రారంభమైంది. 188 షేర్లు లభాల్లో, 520 షేర్లు నష్టాల్లో ఉండగా, 69 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఏషియన్ పేయింట్స్, ఐవోసీ, యస్ బ్యాంకు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ, వేదాంత, హిండాల్కో, ఇండస్ ఇండ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

యస్ బ్యాంకు దూకుడు
ఎస్బీఐ, ఎల్ఐసీ ఆదుకుంటుందనే సంకేతాల నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్లు లాభాల్లోకి వచ్చాయి. ఈ కంపెనీ షేర్లు శుక్రవారం ఓ దశలో రూ.6కు పడిపోయాయి. ఆ తర్వాత 16 వద్ద నిలిచింది. సోమవారం షేర్ ధర 11 శాతం పెరిగి రూ.18వ ద్ద ట్రేడ్ అయింది.

తగ్గిన క్రూడాయిల్ ధరలు
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు రావడంతో ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 26 శాతం తగ్గి బ్యారెల్‌కు 33.66 డాలర్ల వద్దకు చేరుకుంది. డబ్ల్యుటీఐ 27 శాతం నష్టపోయి బ్యారెల్ 30.35 డాలర్ల వద్ద ఉంది.

కరోనా ప్రభావంతో..
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రస్ (ఒపెక్) దేశాలు, రష్యా మధ్య ఇంధన ఉత్పత్తి తగ్గించాలనే అంశంపై చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సౌదీ అరేబియా చమురు ధరలు భారీగా తగ్గించింది. ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో సౌదీ ఈ చర్యకు దిగింది. త్వరలో సౌదీ ఆరామ్‌కో ఉత్పత్తిని కూడా మరింత పెంచనుంది. ఇదే జరిగితే చమురు ధరలు దిగి వస్తాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications