ముంబై: నిన్న (ఏప్రిల్ 8) నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లోకి వచ్చాయి. ఈ రోజు ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 748.97 పాయింట్లు (2.51%) లాభపడి 30,642.93 వద్ద, నిఫ్టీ 217.45 పాయింట్లు (2.49%) ఎగిసి 8,966.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కొద్ది సమయానికి సెన్సెక్స్ 833 పాయింట్లు ఎగిసి 30,727కు చేరుకుంది. నిఫ్టీ 9వేల పాయింట్లు దాటింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,131 పాయింట్లు ఎగిసి 31,000 మార్క్ కూడా దాటింది.
764 షేర్లు లాభాల్లో, 82 షేర్లు నష్టాల్లో ఉండగా 25 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాలు కూడా ఈ రోజు లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం పెరిగాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో షేర్లు 5 శాతం మేర లాభాల్లోకి వచ్చాయి. బీఎస్ఈలోను అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.

ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించే అవకాశముందని వార్తలు రావడంతో బుధవారం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. లాక్ డౌన్ పొడిగిస్తే కేంద్రం మరోసారి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని వార్తలు రావడంతో ఈ రోజు లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం కూడా పడింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications