SEBI News: చిన్న ఇన్వెస్టర్లకు సెబీ పెద్ద ఊరట.. ఇక కుమ్ముడే..!

Demat Account: కరోనా కాలం నుంచి దేశంలో స్టాక్ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు కుప్పులుతెప్పలుగా వస్తోంది. చాలా మంది మార్కెట్లలో పెట్టుబడులు లేదా ట్రేడింగ్ రెండవ ఆదాయ మార్గంగా పరిగణించటమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి రికార్డు స్థాయిల్లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరుగుతున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో దేశంలోని ప్రజలు మార్కెట్లలో పాల్గొనేందుకు మెగురైన అవకాశాలను కల్పించేందుకు సెబీ రూల్స్ మార్చుతోంది. ఈ క్రమంలో మోసాలను అరికట్టడం, స్టాక్ ఆప్షన్లలో బెట్టింగ్ ద్వారా పెట్టుబడిదారులు అనవసరంగా నష్టపోవటాన్ని నివారించేందుకు చర్యలు సైతం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్‌లో చిన్న పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిపై భారాన్ని తగ్గించడానికి సెబీ బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఖాతాలో కనీస మొత్తం పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కొత్తగా పెంచిన పరిమితి సెప్టెంబర్ 1, 2024 నుంచి వర్తించనుంది.

Market regulator SEBI upgrades Basic Demat Account Limit to 10 lakhs Investors happy

సెబీ తీసుకున్న ఈ నిర్ణయం అనేక విధాలుగా చాలా కీలకమైనదని తెలుస్తోంది. వాస్తవానికి బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ ఖాతాలో ఉంచాల్సిన ఆస్తుల పరిమితిని పెంచడం ద్వారా చిన్న పెట్టుబడిదారులు మార్కెట్ల వైపు తమ ఆసక్తిని పెంచుకునేందుకు అవకాశాలను పెంచనుంది. ఈ ఖాతాలో పోర్ట్‌ఫోలియో విలువ రూ.4 లక్షల వరకు ఉంటే వార్షిక రుసుము సున్నా అవుతుంది. అలాగే రూ.4 -10 లక్షల వరకు ఏడాదికి రూ.100 మాత్రమే వసూలు చేస్తారు. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో విలువ రూ.10 లక్షలు దాటితే బేసిక్ డీమ్యాట్ ఖాతా ఆటోమేటిక్‌గా సాధారణ డీమ్యాట్ ఖాతాగా మారుతుంది.

వాస్తవానికి సెబీ బేసిక్ సర్వీస్ డీమ్యాట్(BSDA) ఖాతాను చిన్న పెట్టుబడిదారులను ఉద్ధేశించి 2012లో ప్రవేశపెట్టింది. ఇది తరచుగా స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెట్టనివారి కోసం రూపొందించబడింది. అలాగే పెట్టుబడిదారులపై ఛార్జీల భారాన్ని తగ్గించటం ఈ ముఖ్య ఉద్థేశాల్లో ఒకటి.

డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్‌లు-RTAలు డిఫాల్ట్‌గా ఏకీకృత ఖాతా స్టేట్‌మెంట్‌లను ఈమెయిల్ ద్వారా పంపుతాయి. దీన్ని కంపల్సరీగా చేయాల్సి ఉంటుందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌లో తెలిపింది. కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది ఒక నెలలో డీమ్యాట్ మోడ్‌లో ఉంచబడిన అన్ని మ్యూచువల్ ఫండ్‌ పెట్టుబడులు, ఇతర సెక్యూరిటీల్లో పెట్టుబడిదారుడి ఆర్థిక లావాదేవీల వివరాలను కలిగి ఇందులో ఉండనున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+