SEBI on SME IPOs: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం నిరంతరాయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా ఎస్ఎమ్ఈ ఐపీవోల కోలాహలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వీటి ఐపీవోల విషయంలో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ పెట్టుబడిదారుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత అందిస్తోంది. గతంలోనూ ఎస్ఎమ్ఈ ఐపీవోలతో అప్రమత్తంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను అలర్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజులుగా మార్కెట్లో జాబితాకి వస్తున్న ఎస్ఎమ్ఈ ఐపీవోలు ఇన్వెస్టర్లకు తొలిరోజునే భారీ లాభాలను ఆర్జించిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేటగిరీ ఐపీవోలు అధిక వాల్యుయేషన్లను కలిగి ఉంటున్నాయని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఎస్ఎమ్ఈ ఐపీవోల కోసం నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను కఠినతరం చేసింది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థలకు రుణాల తిరిగి చెల్లించడానికి కంపెనీలు నిధులను ఐపీవోల ద్వారా సమీకరించకుండా నిరోధించేటప్పుడు గత మూడేళ్లలో కనీసం రెండు సంవత్సరాల్లో నిర్వహణ లాభాలను కలిగి ఉన్న సంస్థలను మాత్రమే అనుమతి ఇవ్వాలని తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది.
ప్రస్తుతం తెస్తున్న మార్పులు ఎస్ఎమ్ఈ ఇష్యూల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయటంతో పాటు మంచి ట్రాక్ రికార్డు కలిగిన స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీలు ప్రజల నుంచి వ్యాపారానికి అవసరమైన నిధులను సమీకరించుకుని స్టాక్ మార్కెట్లో జాబితా కావటానికి అవకాశం కల్పించనుంది. తద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని సెబీ యోచిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా తెచ్చిన ఎస్ఎమ్ఈల లాభదాయకత నిబంధనలను పరిశీలిస్తే.. కంపెనీల నిర్వహణ లాభం ఐపీవో ముసాయిదా దరఖాస్తుకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండింటిలో రూ.కోటి కలిగి ఉండాలని సెబీ వెల్లడించింది. ఇదే క్రమంలో కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఎస్ఎమ్ఈలు తమ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ కింద మెుత్తం ఇష్యూలో కేవలం 20 శాతం వరకు మాత్రమే డబ్బును రైజ్ చేయటానికి వీలు కల్పించబడింది. ఇదే క్రమంలో కంపెనీలో వాటాలు కలిగి ఉన్న వ్యక్తులు తమ హోల్డింగ్‌లో 50% కంటే ఎక్కువ విక్రయించరాదని సెబీ స్పష్టం చేసింది.

ఇది కాకుండా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం మొత్తం ఐపీవో పరిమాణంలో 15% లేదా రూ.10 కోట్లు వీటిలో ఏది తక్కువైతే అది పరిమితం చేయబడుతుందని సెబీ వెల్లడించింది. అలాగే ఐపీవో పత్రాలను ప్రజల నుంచి కామెంట్స్ కోసం మూడు వారాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సెబీ పేర్కొంది. మినిమం ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ పరిమితి కంటే ఎక్కువగా ఉన్న ప్రమోటర్ల హోల్డింగ్‌పై లాక్-ఇన్ దశలవారీగా విడుదల చేయబడుతుందని రెగ్యులేటర్ తప్పనిసరి చేసింది. ఇకపై ఎస్ఎమ్ఈ ఐపీవోల కనీస అప్లికేషన్ పరిమాణాన్ని ప్రస్తుతం ఉన్న రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలని సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం లాట్ పరిమాణం పెరగటంతో కనీసం ఇన్వెస్ట్ చేయాల్సిన మెుత్తం కూడా భారీగా పెరగనుంది.
2024లో ఎస్ఎమ్ఈలో హవా..
వాస్తవానికి ఈ ఏడాది ఐపీవోలకు చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీవోలు భారీ సంఖ్యలో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. పైగా ఎస్ఎమ్ఈ కేటగిరీలో 225 కంటే ఎక్కువ కంపెనీలు రూ.8,200 కోట్లకు పైగా ప్రజల నుంచి మూలధన అవసరాల కోసం సమీకరించాయి. ఇదే 2023లో రూ.4,686 కోట్లుగా ఉంది. పైగా బుల్ మార్కెట్లతో పాటు ఐపీవోల హోరు కొనసాగటంతో 2024 పెట్టుబడిదారులకు పెద్ద సంవత్సరంగా చెప్పుకోవాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications