SEBI Vs Hindenburg: అదానీకి కొమ్ముకాస్తున్న సెబీ- నోటీసులపై హిండెన్‌బర్గ్ సంచలనం
Adani News: అదానీ సామ్రాజ్యాన్ని షేక్ చేసిన అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు సెబీ 46 పేజీల షోకాజ్ నోటీసు పంపింది. దీనిపై స్పందిస్తూ సెబీ మోసగాళ్లకు కొమ్ముకాస్తోందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జూన్ 27న భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి షోకాజ్ నోటీసులను అందుకుంది. రీసెర్చ్ సంస్థ భారత నిబంధనలను అనుమానించదగిన ఉల్లంఘనలను వివరిస్తుంది. అలాగే రెగ్యులేటర్ అదానీకి 2023 జనవరి రిపోర్ట్ తర్వాత అండగా నిలిచి రహస్యంగా సహాయం చేసిందంటూ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. దీనిపై సెబీ రంగంలోకి దిగింది.

హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీల్లో షార్ట్ పొజిషన్‌లను మూసివేయడానికి సెబీ తెరవెనుక బ్రోకర్లపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొంది. అలాగే సెబీ కొనుగోలు ఒత్తిడిని ప్రభావవంతంగా సృష్టించి, క్లిష్టమైన సమయంలో అదానీ స్టాక్‌లకు 'ఫ్లోర్' సెట్ చేసిందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు దర్యాప్తుకు ఆదేశించగా ముందుకు వెళ్లటానికి కుదరటం లేదని సెబీ పేర్కొన్నట్లు హిండెన్ బర్గ్ వెల్లడించింది. గౌతమ్ అదానీ 2022లో సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్‌ని రెండుసార్లు కలిశారని పేర్కొంది. అదానీ విషయం మరియు హిండెన్‌బర్గ్ విషయంలో పనిచేసిన సెబీ ఉద్యోగుల పేర్లను కోరుతూ సమాచార హక్కు దరఖాస్తును దాఖలు చేయనున్నట్లు తెలిపింది.
రాయిటర్స్ వార్తాసంస్థ ప్రకారం భారతీయ సంస్థ అయిన కోటక్ బ్యాంక్ ఆఫ్‌షోర్ ఫండ్ నిర్మాణాన్ని దాని "ఇన్వెస్టర్ భాగస్వాములు" గ్రూప్‌కు వ్యతిరేకంగా పందెం వేయడానికి ఉపయోగించినట్లు సృష్టించి, పర్యవేక్షించిందని హిండెన్‌బర్గ్ చెప్పింది. సెబీ షోకాజ్ నోటీసును బెదిరించే ప్రయత్నంగా హిండెన్‌బర్గ్ పేర్కొంది. వాస్తవానికి గత ఏడాది నాథన్ ఆండర్సన్ స్థాపించిన హిండెన్‌బర్గ్ అదానీపై అక్రమ లావాదేవీల ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ ఏకంగా 150 బిలియన్ డాలర్ల వరకు సంపదను నష్టపోయింది. అయితే ఈ షాక్ నుంచి ప్రస్తుతం గ్రూప్ కోలుకుంది. అయితే నేడు స్టాక్ మార్కెట్లలో ఉదయం హిండెన్‌బర్గ్ ప్రతిస్పందన ప్రభావం గ్రూప్ కంపెనీల షేర్లపై కనిపించలేదు.


Click it and Unblock the Notifications