IPO News: కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి ఐపీవోలు క్యూ కడుతున్నాయి. తాజాగా డ్రోన్ కంపెనీ Ideaforge కొన్ని రోజుల క్రితం తన IPOని ప్రారంభించింది. దీనిపై ఇన్వెస్టర్లలో భారీగా అంచనాలు కూడా ఉన్నాయి.
అయితే త్వరలోనే మార్కెట్లోకి టాటాలకు చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీవో రాబోతోంది. ఇందుకోసం ఇటీవల కంపెనీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అవసరమైన అనుమతులను కూడా పొందింది. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఐపీవోలను జారీ చేసే కంపెనీల లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న 6 రోజుల లిస్టింగ్ ప్రక్రియను మూడు రోజులకు తగ్గించేందుకు ఆమోదం తెలిపింది. సెబీ ప్రకటించిన T+3 రోజుల ప్రక్రియను రెండు దశల్లో అమలు చేయబడనుంది. కొత్త IPO లిస్టింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 01, 2023న లేదా ఆ తర్వాత రానున్న అన్ని ఐపీవోల కోసం కంపెనీలు 3 రోజుల నుంచి 6 రోజుల మధ్య ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మే నెలలోనే సెబీ అధ్యయన నివేదిక పేరుతో IPO లిస్టింగ్ వ్యవధిని T+6 రోజుల నుంచి T+3కి తగ్గించాలని నిర్ణయించింది. ఈ మార్పు కంపెనీలతో పాటు ఇన్వెస్టర్లకు కూడా మేలు చేస్తుందని సెబీ అభిప్రాయపడుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా సెబీ దేశంలోని ఐపీవో ఫ్రేమ్‌వర్క్, కంపెనీలు ఐపీవో కోసం అప్లై కోసం ఫైలింగ్, డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications