SEBI on Adani: అదానీ ఆ లింకులపై సెబీ దర్యాప్తు.. కేసును మరింత తవ్వుతున్న రెగ్యులేటర్
SEBI on Adani: దేశంలోని అగ్రగామి వ్యాపార సంస్థల్లో ఒకరుగా ఉన్న అదానీ పేరు ఎక్కువగా 2023లో వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఆయన వ్యాపారాలను విస్తరిస్తున్న వేగం ఒకపక్క అయితే మరోపక్క అదానీపై వచ్చిన ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో హిండెన్ బర్గ్ సంస్థ లేవనెత్తిన షేర్ ధరల తారుమారు, ఆఫ్ షోర్ ఫండ్స్ దుర్వినియోగం ఆరోపణల అంశాలపై సెబీ ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా వీటి విస్తీర్ణాన్ని మరింతగా పెంచుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్-గల్ఫ్ ఆసియా ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ మధ్య సంబంధాలపై దృష్టి సారించింది. ఈ సంస్థ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కేంద్రంగా పనిచేస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనలో వెల్లడించింది.

దీనికి సంబంధించిన విషయాలు, దర్యాప్తు గోప్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఏదైనా వాటా యాజమాన్య నియమాలు ఉల్లంఘించబడిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభించబడినట్లు తెలుస్తోంది. గత నెలలో గల్ఫ్ ఆసియా ఫండ్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త నాసర్ అలీ షాబాన్ అలీకి చెందినదని వెల్లడైంది. అయితే ఆ తర్వాత వెబ్‌సైట్ క్లోజ్ చేయబడిందని సమాచారం.
ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ప్రకారం ఈ ఫండ్ అదానీ కంపెనీల్లో పెట్టుబడులను పెట్టింది. దీనికి ముందు జనవరి 2023లో షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ అకౌంటెన్సీ మోసాలు, స్టాక్స్ మానిప్యులేషన్ వంటి అనైతిక చర్యలకు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేసిన తర్వాత రెగ్యులేటరీ సంస్థ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఆరోపణలు దేశంలో రాజకీయంగానూ వేడిని పెంచాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులతో అదానీ కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉన్న అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు కొంత ఆందోళనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications