SEBI News: దేశంలోని స్టాక్ మార్కెట్ల పనితీరును మెరుగుపరిచేందుకు రెగ్యులేటరీ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు నూతన పరిష్కారాలతో ముందుకు వస్తోంది. తాజాగా పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం సెంట్రలైజ్డ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది.
ఇకపై పెట్టుబడిదారుడి మరణాన్ని నివేదించడానికి, ధృవీకరించడానికి సెంట్రలైజ్డ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. సెక్యూరిటీల మార్కెట్‌లో ఆస్తులను బదిలీ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యంగా ఉంది. ఈ సర్క్యూలర్ జనవరి 01, 2024 నుంచి అమలులోకి వస్తుందని సెబీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ మరణానికి సంబంధించిన వివరాలను బ్రోకరేజ్ అందుకున్న తర్వాత ముందుగా నోటిఫైయర్ నుంచి పాన్‌తో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుంది.

మరణ ధృవీకరణ పత్రాన్ని ధృవీకరించే ప్రక్రియను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేయవచ్చుని సెబీ వెల్లడించింది. ఇందులో సంబంధింత పత్రాలను రికార్డు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడి మరణానికి సంబంధించిన సమాచారాన్ని పొందిన తర్వాత మరణ ధృవీకరణ పత్రాన్ని బ్రోకరేజ్ అందుకోని పక్షంలో సదరు ఇన్వెస్టర్ కేవైసీ స్థితిని 'ఆన్ హోల్డ్'గా కేటాయిస్తుంది.
ముఖ్యంగా KYC స్థితి నవీకరించబడిన తర్వాత మరణించిన పెట్టుబడిదారు ఖాతా/ఫోలియోల్లోని అన్ని డెబిట్ లావాదేవీలు బ్లాక్ చేయబడతాయి. ఇదే క్రమంలో ఖాతా ఉమ్మడి ఖాతాగా లేదా సర్వైవర్ మోడ్‌లో నిర్వహించబడుతున్నట్లయితే సదరు అకౌంట్ ఆపరేషన్ కొనసాగుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications