IPO News: జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీవోకు బ్రేకులు.. మెగా ఐపీవోను హోల్డ్‌లో పెట్టిన సెబీ.. ఎందుకంటే?
JSW Cement IPO: మార్కెట్లోకి ప్రస్తుతం చిన్న చిన్న పిల్ల ఐపీవోలతో పాటు పెద్ద సంస్థల ఐపీవోలు సైతం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ తీసుకొస్తున్న రూ.4,000 కోట్ల మెగా ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ బ్రేకులు వేయటం బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది.
తాజాగా JSW గ్రూప్ దాని రాబోయే సిమెంట్ కంపెనీని ఐపీవోగా ఫ్లోట్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సెబీ దీనిని హోల్డ్ కేటగిరీలో చేర్చటం కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బను కలిగించింది. ఈ మెగా ఐపీవోలో కంపెనీ రూ.2000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో అమ్మకానికి ఉంచగా మిగిలిన రూ.2000 కోట్లు కొత్త ఈక్విటీ షేర్ల జాబితా ఉంది. ఏ పరిశీలనల జారీకి సంబంధించిన పత్రం నిలిపివేయబడిందనే విషయాన్ని సెబీ పేర్కొంది. సందర్భానుసారంగా 30 రోజులు, 45 రోజులు, 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పరిశీలనల జారీని నిలిపివేయడానికి SEBI బాధ్యత వహిస్తుంది.

కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద ఐపీవోలో వాటాలు విక్రయిస్తున్న వారిని పరిశీలిస్తే.. ఏపీ ఏషియా ఆపర్చునిటీస్ హోల్డింగ్స్ రూ.937.5 కోట్లు, సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్ రూ.937.5 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.125 కోట్లు విలువైన పెట్టుబడులను ఆఫ్ లోడ్ చేస్తున్నాయి. అలాగే సెబీ ఆఫర్‌ను క్లియర్ చేసిన తర్వాత ప్రైస్ బ్యాండ్, ఐపీవో కొత్త తేదీలు, యాంకర్ ఇన్వెస్ట్‌మెంట్ తేదీ వంటి వివరాలను కంపెనీ ప్రకటించనుంది.
కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజస్థాన్‌లోని నాగౌర్‌లో రూ.800 కోట్లతో కొత్త ఇంటిగ్రేటెడ్ సిమెంట్ యూనిట్‌ని స్థాపించడానికి కొంత భాగం ఫైనాన్సింగ్ కోసం వినియోగించాలని చూస్తోంది. ఇదే క్రమంలో రూ.720 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడనున్నారు. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో తన షేర్లను జాబితా చేయనుంది.


Click it and Unblock the Notifications