SEBI News: నేక్డ్ షార్ట్ సెల్లింగ్ నిలిపేసిన సెబీ.. వారు డే ట్రేడింగ్ చేయటం కుదరదు..!!
Short Selling: దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ భారత ఈక్విటీ మార్కెట్లలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పెట్టుబడిదారులకు రక్షణ కల్పించటంతో పాటుగా.. అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే తాజాగా డే ట్రేడింగ్ విషయంలోనూ కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని కేటగిరీల్లోని పెట్టుబడిదారులను షార్ట్ సెల్లింగ్‌కు అనుమతిస్తామని, అయితే నేక్డ్ షార్ట్ సెల్లింగ్‌ను అనుమతించబోమని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా శుక్రవారం తేల్చి చెప్పింది. ఇందుకోసం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(F&O) కేటగిరీలో ట్రేడింగ్ చేసే అన్ని స్టాక్‌లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని స్పష్టం చేసింది.

సెటిల్‌మెంట్ సమయంలో సెక్యూరిటీలను డెలివరీ చేసే తమ బాధ్యతను ఇన్వెస్టర్లందరూ తప్పనిసరిగా పాటించాలని సెబీ పేర్కొంది. ఏ సంస్థాగత పెట్టుబడిదారుడూ డే ట్రేడింగ్ చేయడానికి లేదా వారి లావాదేవీలను ఇంట్రా-డే చేయకూడదని సెబీ వెల్లడించింది. షార్ట్ సెల్లింగ్, సెక్యూరిటీల లెండింగ్, బారోయింగ్ స్కీమ్‌పై మార్కెట్ రెగ్యులేటర్ ఫ్రేమ్‌వర్క్ తెలిపింది. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అంటే ట్రేడ్ సమయంలో సెల్లర్స్ తన సొంతం కాని షేర్లను విక్రయించటం అన్నమాట. సెటిల్మెంట్ సమయంలో సెక్యూరిటీల డెలివరీ వైఫల్యాన్ని నిరోధించేందుకు ఇది పనిచేస్తుందని సెబీ స్పష్టం చేసింది.
గత ఏడాది అదానీ గ్రూప్ కంపెనీలు ప్రైస్ మ్యానిపులేషన్ అక్రమాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించటం పెను సంచలనాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సెబీ షార్ట్ సెల్లింగ్ చట్టాలను మార్చేస్తోంది. దీని ద్వారా మార్కెట్లలో మ్యానిపులేషన్స్ అరికట్టడంతో పాటు సరసమైన ధరలకు షేర్లను విక్రయించేందుకు వీలు దొరుకుతుందని సెబీ పేర్కొంది. అందుకే షాల్ట్ సెల్లింగ్ డేటాను ప్రతిరోజూ సాయంత్రం తమకు బ్రోకరేజ్ సంస్థలు అందించాలని సెబీ పేర్కొంది.


Click it and Unblock the Notifications