ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా మహమ్మారి దెబ్బకు సెన్సెక్స్ ఏకంగా 3,934 పాయింట్ల నష్టంతో 25,981.24 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది. బ్యాంకు నిఫ్టీ 16.24 శాతం, నిఫ్టీ ఆటో 14.71 శాతం మేర నష్టపోయింది. ఉదయం ట్రేడింగ్ దాదాపు గంట సేపు నిలిచిన విషయం తెలిసిందే. అన్ని రంగాల షేర్లు.. దాదాపు అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‍టెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటా కార్పు, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, రిలయన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, మారుతీ, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 9 శాతం నుండి ఏకంగా 23 శాతం మేర పడిపోయాయి.

పర్సెంటీజీ, అంకెల పరంగా అతి పెద్ద పతనం
ఒకరోజులో అంకెల పరంగా, అలాగే పర్సంటేజీ పరంగా అతి పెద్ద పతనం ఇదే. దేశంలోని ఏడు రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు కుదేలయ్యాయి. దేశంలో కరోనా రెండో దశకు చేరడం, ఆదివారం ముగ్గురు మృతి చెందడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. మార్కెట్ సోమవారం ఏ దశలోను కోలుకోలేదు.

అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
భారత మార్కెట్లు నష్టపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. జపాన్ మార్కెట్ మినహా ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఆ ప్రభావం మనపై పడింది. దక్షిణ కొరియా మార్కెట్ కూడా తీవ్ర నష్టాల్లో ఉంది. అమెరికాలో డోజోన్స్ ఫ్యూచర్స్ పతనమైంది.

అమెరికా ప్యాకేజీ
అమెరికా ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకంజీ ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో అమెరికా ఫ్యూచర్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. వైద్య సేవలకు నిధులు అవసరమైన సమయంలో జాప్యం చేయకుండా మంజూరు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కీలకమ ఓట్లను ఇది సాధించలేదని తెలుస్తోంది.

రూపాయి పతనం.. FPI
డాలర్ మారకంతో రూపాయి విలువ పతనమవుతోంది. ఈ రోజు ఓ సమయంలో 76.15కు చేరుకుంది. ఇది రికార్డ్. ఇప్పటికే FPIలు 50వేల కోట్ల మేరకు విక్రయించారు. రూపాయి పతనం కూడా మార్కెట్లపై పడింది.

సెబి నిబంధనలు..
సెబీ ఆదేశాల వల్ల FII, DIIలు ప్రస్తుతం షార్ట్ సెల్లింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో మార్కెట్ హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే మార్కెట్ ట్రెండ్‌ను మాత్రం మార్చలేకపోయింది. సెబి ఆశించినట్లుగా ఇప్పటికి హెచ్చుతగ్గులు పరిమితంగా ఉన్నాయి. విక్రయించే ట్రేడింగ్‌లో మార్పు లేదు.

వాహనాల ఉత్పత్తి నిలుపుదల
పలు వాహన కంపెనీలు తాత్కాలికంగా తమ ఉత్పత్తులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. మారుతీ సుజుకీ, మహీంద్రా మహీంద్రా, హీరో, హోండా తదితర కంపెనీలు ఉత్పత్తులు నిలిపివేశాయి. ఈ ప్రభావం తమ ఆదాయాలపై పడుతుందనే భయాలు కమ్ముకున్నాయి.

ఇండియా బుల్స్ ఒక్కటే..
మార్కెట్లో మధ్యాహ్నం వరకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కటే లాభాల్లో కొనసాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 7.71 శాతం లాభంతో రూ.97.80 వద్ద ముగిసింది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications