ఊరట: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, అన్ని రంగాల్లో ప్లస్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (24, మార్చి) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 1,212.60 పాయింట్లు (4.67%) ఎగిసి 27,193.84 వద్ద, నిఫ్టీ 353.85 పాయింట్లు పెరిగి ( 4.65%) 7,964.10 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. బజాజ్ ఫిన్‌సర్వ్, వేదాంత, సిప్లా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, రిలయన్స్ తదితర షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ సమయంలో నిఫ్టీ 8,000 మార్క్ దాటింది. ఆ తర్వాత లాభాలు తగ్గాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది.
సోమవారం స్టాక్ మార్కెట్లు అన్నీ భారీ నష్టాల్లో ప్రారంభమైన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో సూచీలు పతనమయ్యాయి. దీంతో ట్రేడింగ్ 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. సెన్సెక్స్ 3,935 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో వరుసగా 25,981, 7,610 వద్ద క్లోజ్ అయింది.

సెన్సెక్స్ 8,000 దిగువకు చేరుకుంది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండు 10 శాతం పడిపోవడంతో నిన్న గం.9.57కు ట్రేడింగ్ ఆపేశారు. ఆ తర్వాత గం.10.42కు ట్రేడింగ్ ప్రారంభమైంది. 15 నిమిషాలు ప్రి ఓపెనింగ్ ట్రేడింగ్ అనంతరం గం.10.57కు సాధారణ ట్రేడింగ్ ప్రారంభమైంది. లోయర్ సర్క్యూట్‍కు పడిపోయి ట్రేడింగ్ నిలిచిపోతే సాధారణ ట్రేడింగ్ లాగే ఈ సమయంలోను ప్రీ ఓపెనింగ్ ట్రేడింగ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications