భారత మార్కెట్లు బుధవారం నాడు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ఊగిసలాటలో కదలాడాయి. అనంతరం సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంలోకి వచ్చింది. ఈ రోజు డాలర్ మారకంతో రూపాయి 27 పైసలు బలపడి 73.81 వద్ద ఉంది. ఇది సోమవారం 74.08 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మధ్యాహ్నం గం.12.35 సమయానికి సెన్సెక్స్ 174.05 (0.49%) పాయింట్లు పెరిగి 35,809.00 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 38.15 (0.37%) పాయింట్లు పెరిగి 10,489.60 వద్ద ట్రేడ్ అయింది. రిలయన్స్, అదానీ గ్యాస్, ఎస్బీఐ, ఎఎన్జీసీ, కోల్ ఇండియా లాభాల్లో, బీపీసీఎల్ వంటివి నష్టాల్లో ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, బీపీసీఎల్, టాటా స్టీల్, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యు ఉన్నాయి. రిలయన్స్ షేర్ దాదాపు రూ.50 వరకు పెరిగింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు షేర్లు కూడా ఎస్బీఐ ముందుకు రావడంతో లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు గం.12.40 సమయానికి యస్ బ్యాంకు షేర్లు రూ.6.40 పెరిగి (30.12 శాతం) రూ.27.65 వద్ద ట్రేడ్ అయింది. సోమవారం మార్కెట్లు భారీ నష్టాల్లో క్లోజ్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications