ముంబై: చమురు ధరలు రికార్డ్ స్థాయిలో పతనమైన విషయం తెలిసిందే. ఏకంగా జీరో కంటే తక్కువకు పడిపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 21) నష్టాలతో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. అలాగే, దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిషేధించనున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇది కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది.
ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 8,32.68 పాయింట్లు లేదా 2.63% నష్టపోయి 30,815.32 వద్ద, నిఫ్టీ 235.75 పాయింట్లు లేదా 2.55% నష్టపోయి 9,026.10 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. గం.11 సమయానికి సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పడిపోయింది. 326 షేర్లు లాభాల్లో, 605 షేర్లు నష్టాల్లో ఉండగా, 31 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి 20 పైసలు పడిపోయి 76.74 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 76.54 వద్ద క్లోజ్ అయింది.

మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా, బ్రిటానియా, నెస్ట్లే ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, హిండాల్కో, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా మిగతా రంగాలు నష్టాలను చవి చూస్తున్నాయి. మెటల్, ఆటో రంగాలు భారీగా పడిపోయాయి.
క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు పడిపోయి 30,636 వద్ద, నిప్టీ 280 పాయింట్లు కోల్పోయి 8,981 వద్ద క్లోజ్ అయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు 12 శాతం నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, మారుతీ నష్టపోయాయి. భారతీ ఎయిర్ టెల్, హీరో మోటా కార్ప్, నెస్ట్లే షేర్లు లాభపడ్డాయి.
లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు గిరాకి పడిపోయింది. మే నెల కాంట్రాక్ట్ అమెరికా బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో జీరో కంటే దిగజారిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సోమవారం బ్యారెల్ ధర ఏకంగా మైనస్ 37.63 డాలర్లకు పడిపోయింది. ఈ ప్రభావం మార్కెట్లపై భారీగా పడింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications