ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 79.92 పాయింట్లు లేదా 0.25% లాభపడి 31,459.47 వద్ద, నిఫ్టీ 30.15 పాయింట్లు లేదా 0.33% లాభపడి 9,217.45 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా ఎగిసింది. అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు కాస్త లాభపడ్డాయి. బ్రెంట్ క్రూడాయిల్ 33 సెంట్లు లేదా 1.6 శాతం ఎగిసి బ్యారెల్ 20.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
ఓఎన్జీసీ, టాటా స్టీల్, కొటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్, సన్ ఫార్మా, అల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, హెచ్‌డీఎప్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్స్,బ్రిటానియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, శ్రీ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. నిన్న కూడా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో భారత కరెన్సీ నిన్న కాస్త కోలుకున్నప్పటికీ రూ.77 దగ్గరలో ఉంది. ఇండియన్ కరెన్సీ త్వరలో రూ.80కి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న ఓ సమయంలో 76.91 వద్ద ట్రేడ్ అయి చివరకు 76.67 వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications