ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, లాభాల నుండి నష్టాల్లోకి సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వీకెండ్.. శుక్రవారం (మార్చి 20) స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. కానీ అది ఎంతో సేపు నిలువలేదు. ఉదయం గం.09:19 సమయానికి సెన్సెక్స్ 184.04 పాయింట్లు (0.65%) ఎగిసి 28,472.27 వద్ద, నిఫ్టీ 62.05 పాయింట్లు (0.75%) లాభపడి 8,325.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ 200కు పైగా పాయింట్ల నష్టంలోకి వెళ్లింది. ఓసమయంలో 275 పాయింట్ల సమీపానికి చేరుకొని, తిరిగి 100 పాయింట్ల నష్టానికి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చి మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. కరోనా కేసులు పెరుగుతుండటం.. నెలలుగా ఇదే పరిస్థితి ఉండంటతో ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
491 షేర్లు లాభాల్లో, 281 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. పవర్ గ్రిడ్, గెయిల్, ఎఎన్జీసీ, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఐటీసీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్‌టెల్ భారీ లాభాల్లో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో ఉన్నాయి. భారత కరెన్సీ డాలర్ మారకంతో 21 లాభపడి 74.77 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో 74.98 వద్ద క్లోజ్ అయింది.

కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. కరోనాకారణంగా దాదాపు 9 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. రెండున్నర లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రపంచం మొత్తం స్తంభించినంది!


Click it and Unblock the Notifications