ముంబై: మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు (మార్చి 6) మార్కెట్లు 2020లోనే తొలిసారి భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 1,281.85 పాయింట్లు (3.33%) నష్టపోయి 37,188.76 వద్ద, నిఫ్టీ 386.30 (3.43%) పాయింట్లు నష్టపోయి 10,882.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 74 షేర్లు లాభాల్లో, 802 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

భయంతో.. ముందుచూపు... రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
కరోనా వైరస్ తదితర కారణాలతో గత శుక్రవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ శుక్రవారం కూడా అలాగే నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కరోనా విజృంభించడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో తమ సంపదను కోల్పోవాల్సి వస్తుందనే భయంతో ఇన్వెస్టర్లు భారీగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే ర.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. కేవలం 60 సెకండ్లలోనే రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది.

బ్యాంకింగ్ షేర్లు పతనం
ఒక దేశలో సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు పతనమైంది. రూపాయి కూడా డాలరు మారకంతో 74 మార్క్ చేరుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. పీఎస్‌యూ బ్యాంకులు 5 శాతం మేర నష్టపోయాయి. మెటల్ షేర్లు 4.5 శాతం డౌన్ అయ్యాయి.

భారీగా నష్టపోయిన యస్ బ్యాంకు షేర్లు
ఏప్రిల్ 3వ తేద వరకు కస్టమర్లపై రూ. 50,000 నగదు పరిమితి విధించిన నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్ల అమ్మకాలు పెరిగాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 10% పతనమైన షేర్ ఆ తర్వాత 50 శాతం పైకి చేరుకుంది. మధ్యాహ్నం గం.11.16 సమయంలో బ్యాంక్ షేర్ ఏకంగా 55 శాతం పడిపోయి షేర్ విలువ రూ.16.60కి పడిపోయింది. ఆ తర్వాత కాసేపటికి 80 శాతం పడిపోయి రూ.7.15కి చేరుకుంది. ఎస్బీఐ టేకోవర్ చేస్తుందనే అంచనాలతో గురువారం షేర్లు పుంజుకున్నాయి. అయితే ప్రకటన రాకపోవడంతో ఈ రోజు నష్టపోయాయి.

నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు
కరోనా వైరస్ భయాలతో ప్రపంచ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. కరోనా మరణాలు 3,300కు చేరుకున్నాయి. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలలో కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. అమెరికా సిలికాన్ వ్యాలీ, సియాటెల్‌లోని టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి జారుకోవచ్చుననే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. గురువారం అమెరికా, యూరోపియన్ స్టాక్ ఇండెక్స్‌లు 3.5 శాతం నుండి 1 శాతం వరకు పతనమయ్యాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications