ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.37.59 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 9,204.42 పాయింట్లు లేదా 24 శాతం, నిఫ్టీ 3,026.15 పాయింట్లు లేదా 26.03 శాతం నష్టపోయాయి. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 మార్చి 31వ తేదీ వరకు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి.

మార్చిలోనే అత్యధిక నష్టం
మంగళవారంతో (మార్చి 31) ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.37.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయినప్పటికీ.. ఇందులో అత్యధిక శాతం నష్టాలు వాటిల్లింది మార్చి నెలలోనే. కరోనా ప్రభావం భారత్‌పై కూడా చూపింది. ఇది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లు గతంలో లేనివిధంగా నష్టపోయాయి.

అందుకే... 37.59 లక్షల కోట్లు ఆవిరి
BSE లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ రూ.37,59,954.42 కోట్లు ఆవిరై రూ.1,13, 48, 756.59 కోట్లకు పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టించడం, ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే పరిస్థితులు కనిపించడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్ పైనా కరోనా ప్రభావం కనిపించడం ఆందోళన కలిగించింది.

సెన్సెక్స్ రెండు నెలల్లో 16వేల పాయింట్లు డౌన్
ఈ ఏడాది జనవరి 20వ తేదీన 42,273.87 పాయింట్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మార్చి 24న 25,638.90 పాయింట్లకు పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో 16,635 పాయింట్లు నష్టపోయింది.

నిఫ్టీ కూడా..
నిఫ్టీ కూడా గతంలో ఎన్నడూలేని విధంగా 12,000 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ఓ దశలో 8,000 దిగువకు వచ్చింది. నిన్న (మార్చి 31) సెన్సెక్స్ 1,000 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 8,600కు ఎగబాకింది. గత వారం కాస్త కుదురుకున్నట్లుగా కనిపించినా ఈ వారంలో సోమవారం భారీగా నష్టపోయాయి. తిరిగి మంగళవారం కాస్త ఊరట కలిగింది.

రెండేళ్లలో ఇలా..
2018-19 ఆర్థిక సంవత్సరంలో BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.8.84 లక్షల కోట్లు పెరిగింది. 2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.7,05,211.81 కోట్ల మార్కెట్ వ్యాల్యూతో మొదటి స్థానంలో ఉంది. రూ.6,84,078.49 కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. గత ఏడాది నవంబర్ నెలలో రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ రికార్డ్ సృష్టించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications