Stock Market: ఫెడ్ వల్లే పతనమైన మార్కెట్లు..! చైనా నిర్ణయం.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు ఏంటి..
Stock Market: గడచిన వారం మార్కెట్లు ముందుగా చరిత్ర సృష్టించాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ తన పాత రికార్డులను అధిగమించి కొత్త జీవితకాల గరిష్ఠాలను నమోదు చేసింది.
అయితే ఆ తర్వాత మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకుని చివరికి శుక్రవారం కూడా నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ చేసిన హాకిష్ వ్యాఖ్యలతో వడ్డీ రేట్ల పెంపు తిరిగి రావొచ్చనే ఆందోళనలతో భారత మార్కెట్లు భేజారాయి. మొండిగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచడం కొనసాగించవచ్చని ఫెడ్ పునరుద్ఘాటించింది.

అలాగే జూన్ 9తో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 1.318 బిలియన్ డాలర్లు తగ్గి 593.749 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన డేటాతో ట్రేడర్లు జాగ్రత్తగా ఉన్నారు. మరోపక్క ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యంపై ప్రైవేట్ నివేదిక హెచ్చరికలు కూడా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని మరింతగా పెంచేశాయని నిపుణులు చెబుతున్నారు. వారం చివరి రెండు రోజులు దీనిని ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇదే క్రమంలో ఇంగ్లండ్, నార్వే, స్విట్జర్లాండ్‌లోని విధాన రూపకర్తలు వడ్డీ రేట్ల పెంపులు వెలువడ్డాయి. దీనివల్ల ప్రపంచ బాండ్ ఈల్డ్స్ పెరగటం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి.

ఇదే క్రమంలో వీటికి విరుద్ధంగా చైనా సెంట్రల్ బ్యాంక్ మాత్రం తన వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. ఈ గ్లోబల్ ఆందోళనలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు భారీ కరెక్షన్‌కు లోనయ్యే అవకాశం లేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రానున్న వారంలో భారత స్టాక్ మార్కెట్లు కొంత భేరిష్ ధోరణిని చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో పక్క ఇన్వెస్టర్లు సైతం మార్కెట్లలో లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలు జరపటం కొంత అస్థిరతలకు ఆజ్యం పోస్తోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications