Market Crash: సెన్సెక్స్ 900 పాయింట్లు డ్రాప్.. అదానీ స్టాక్స్ పతనం, మరో రెండు కారణాలతో ఢమాల్..

Sensex-Nifty Crash: గడచిన పదిరోజులకు పైగా దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బేర్స్ పంజాలో చిక్కుకున్న మార్కెట్లు కరెక్షన్ ఫేజ్ చూస్తుండగా.. నేడు అదానీ గ్రూప్ లంచాలకు సంబంధించిన వార్త వెలుగులోకి రావటంతో మార్కెట్లు తలకిందులయ్యాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో 1 శాతానికి పైగా నష్టపోవటానికి కారణంగా మారింది.

ప్రధానంగా నేడు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్ సూచీ భారీ నష్టాలను చవిచూసింది. ఇదే క్రమంలో మెటల్, మీడియా రంగాలకు చెందిన సూచీలు సైతం ఊహించని నష్టాలను మూటకట్టుకున్నాయి. ప్రధానంగా అమెరికాలో అదానీ లంచాల అభియోగాలతో నేడు మార్కెట్ల ప్రారంభం నుంచి అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు ఎంత తక్కువకైనా సరే అదానీ స్టాక్స్ అమ్మేసి నష్టాలతో అయినా సరే బయటపడాలని ఎగబడుతున్నారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ముదురుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మెుండితనం భారతీయ మార్కెట్లలో పెట్టుబడిదారులకు కన్నీరే మిగుల్చుతున్నాయి.

Market Indices Sensex-Nifty crashed by 1 amid Adani Saga FII outflows and Geopolitical Tensions

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మార్కెట్ విశ్లేషకులు కూడా సెంటిమెంట్లను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి సర్కార్ కేంద్రంలో కొనసాగటానికి తాజాగా మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అత్యంత కీలకంగా మార్కెట్ వర్గాలు పరిగణిస్తున్నాయి. ప్రధానంగా అదానీ గ్రూప్ సోలార్ ఎనర్జీ బిజినెస్ లాభదాయకత లాభీయింగ్ కోసం లంచాలు ఇచ్చినట్లు బయటపడటం, అది అమెరికాతో పాటు సెబీ వద్దకు చేరటంతో భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో భయాందోళలు రేకెత్తించాయి. మహారాష్ట్రలో అధికార ప్రభుత్వానికి ఏదైనా ప్రతికూల ఫలితం మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచుతుందని భావిస్తున్నట్లు స్టాక్ బాక్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో నష్టాల నుంచి స్వల్పంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 514 పాయింట్లు పతనంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్ల మేర నష్టాలతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 359 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 90 పాయింట్లకు పైగా నష్టాన్ని చూస్తోంది. ఇదే సమయంలో మార్కెట్లో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ షేర్లు 20% వరకు పడిపోయాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.2.2 లక్షలకు పైగానే ఆవిరి కావటంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలో ఎరుపెక్కాయి.

అదానీని అరెస్ట్ చేయాలి..?
దేశీయ వ్యాపారవేత్త కుబేరుడు గౌతమ్ అదానీపై భారీగా లంచాల ఆరోపణలు బయటపడిన వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడైనా గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని, అయితే ప్రధాని మోదీ ఆయనను రక్షిస్తున్నారని బాంబు పేల్చారు. బిలియన్ డాలర్ల మేర ఫ్రాడ్ స్కీమ్ ద్వారా భారీగా లబ్ధిపొందాలని చూసిన గౌతమ్ అదానీని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందేనని ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గతంలో హిండెన్ బర్గ్ అదానీ అక్రమాలను బయటపెట్టిన సమయంలో సైతం చర్యలు చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు మంచి మైలేజీని తెచ్చిపెడుతోంది. ప్రధాని మోదీ, సెబీ చీఫ్ మాదబీ పూరీ బుచ్ పై కాంగ్రెస్ నేతలు మాటల దాడి మెుదలెట్టారు. అదానీని రక్షించటం మానుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+